News

తెలంగాణ బీజేపీ నేతల అరెస్టు

568views

తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి భాజపా పిలుపునివ్వడంతో ఆపార్టీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అసెంబ్లీ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ … అసెంబ్లీ పరిసర ప్రాంతాల వరకు భాజపా నాయకులు, మహిళా మోర్చా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. నాంపల్లి, బషీర్‌బాగ్‌, పోలీస్ కంట్రోల్‌ రూమ్‌ ముందు పోలీసులు భాజనేత కె.లక్ష్మణ్‌, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తితో పాటు పలువురిని బలవంతంగా అరెస్టు చేశారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్‌ చేశారు.

బండి సంజయ్‌ అరెస్టు

అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్‌ స్టేషన్‌కు తరలించారు. బండి సంజయ్‌ను తరలిస్తున్న వాహనానికి భాజపా కార్యకర్తలు అడ్డంగా పడుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులను అడ్డుకున్న కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకుని గోషామహల్‌ తరలించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.