
675views
జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైనికులు అదుపులోకి తీసుకొని వారినుంచి భారీ పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా ద్రుగ్‌ముల్లా ప్రాంతంలోని చెక్‌పోస్టు వద్ద గురువారం రాత్రి సైన్యం తనిఖీలు నిర్వహించింది. కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. కాగా అందులో ఒక ఏకే-47 రైఫిల్, రెండు గ్రనైడ్లు, మరిన్ని పేలుడు సామగ్రి, రూ.7 లక్షల నగదు లభ్యమయ్యాయి. సైనికులు వారిని వెంటనే అదుపులోకి తీసుకొన్నారు. వారిని జైషే ఉగ్రవాదులుగా గుర్తించినట్లు వెల్లడించారు.





