GalleryNews

తెలుగు నాట ” ప్రకృతి వందన “

1.9kviews

భారతీయులు  అనాదిగా ప్రకృతి ఆరాధకులు.  రాయి రప్పా చెట్టు చేమలను,  నదీనదాలను  దైవ స్వరూపాలుగా భావించి పూజించడం  భారతీయ సంస్కృతిలో ఒక భాగం.  ఈ ఆచారాలన్నీ మూఢమైనవని  కొందరు  విధర్మీయులు  మనలను అపహాస్యం చేయడం కూడా మనమెరుగుదుము.  నిజానికి భారతీయుల ప్రకృతి ఆరాధన వెనుక మానవ జీవన మనుగడకు ఉపయోగపడే ప్రకృతి సంపదను నాశనం చేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ తమ మనుగడకు ఉపయోగించుకుని మన భావితరాలకు సైతం  సురక్షితంగా  అందించాలన్న గొప్ప స్పృహ దాగి ఉన్నది.  నిజానికి యావత్ ప్రపంచానికి ప్రకృతి ఆరాధన  ఆదర్శనీయం,  ఆచరణీయం. అయితే  దురదృష్టవశాత్తు పాశ్చాత్యుల మాయలో,  వ్యామోహంలో పడిన భారతీయులు కూడా ప్రకృతి సంరక్షణను విస్మరించి తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతిని నాశనం చేయడం ప్రారంభించారు. కొండ కోనలతో, నదీనదాలతో,  పచ్చని  వనాలతో,  ఆ వనాలలో జీవనం చేస్తున్న జంతుజాలంతో,  పంట పొలాలతో శోభాయమానంగా వెలుగులీనుతూ ఉండిన  దేశం నేడు రోజురోజుకూ తన పచ్చదనాన్ని,  ఆహ్లాదకర వాతావరణాన్ని కోల్పోయి కాంక్రీట్ జంగిల్ గా మారుతూ ఉంది.

పర్యావరణ రక్షణకు కట్టుబడి ఉంటామని సంకల్పం చేస్తూ పర్యావరణ రక్షకులుగా తమ పేర్లను నమోదు చేసుకున్న వారి సంఖ్యా వివరాలు జిల్లా వారీగా …..

ఈ నేపథ్యంలో ప్రకృతిని ఆరాధించడమనే  మన పూర్వీకుల సంస్కృతిని గుర్తు చేయడంతో పాటు,  ప్రకృతి సంరక్షణ ఆవశ్యకతను యావద్దేశ ప్రజలకు, ముఖ్యంగా హిందూ బంధువులకు తెలియజేయడానికి  రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్  పెద్దలు 30/8/2020 ఆదివారం ఉదయం 10  నుంచి 11 గంటల మధ్యలో అందరూ తమకు సమీపంలోని వృక్షాలకు పూజలు చేయడం ద్వారా ప్రకృతి పట్ల  తమ విశ్వాసాన్ని,  ప్రకృతి సంరక్షణ పట్ల తమకున్న నిబద్ధతను చాటుకోవలసిందిగా ” ప్రకృతి వందన”  అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ పిలుపు మేరకు యావత్ దేశంలోని ప్రజలందరూ ముఖ్యంగా మాతృమూర్తులు తమకు సమీపంలో ఉన్న చెట్లకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.తమ చుట్టూ ఉన్న వృక్ష సంపదను కాపాడుకుంటామని ఈ సందర్భంగా సంకల్పం చేసుకున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్ సంఘచాలక్ డాక్టర్  మోహన్ భాగవత్ ” ప్రకృతి వందన”  కార్యక్రమం సందర్భంగా తమ అమూల్య సందేశాన్ని అందించారు.  మన రాష్ట్రంలో కూడా అనేకమంది హిందూ బంధువులు ప్రకృతి వందన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  ఆ చిత్రమాలికను  ఓసారి పరికిద్దాం.

విజయవాడ హైందవిలో…

మచిలీపట్నంలో….

గుంటూరులో….

తెనాలిలో….

  

సత్తెనపల్లిలో….

మంగళగిరిలో….

  

తూర్పు గోదావరి జిల్లాలో….

నెల్లూరులో….

నెల్లూరు జిల్లా గూడూరులో….

మదనపల్లిలో….

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.