News

నౌహీరా షేక్ భూములు స్వాధీనం చేసుకున్న ఈడీ

576views

హీరా గోల్డ్‌ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు, హీరా గోల్డ్‌ సంస్థల ఎండీ నౌహీరా షేక్‌కు చెందిన భూములును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) స్వాధీనం చేసుకుంది. టోలీ చౌకి ఎస్‌ఏ కాలనీలో రూ. 70 కోట్ల విలువైన 81 ప్లాట్లను రెవెన్యూ, పోలీసుల సహకారంతో ఈడీ తమ అధీనంలోకి తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో సుమారు రూ. 300 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. హీరో గోల్డ్‌ రూ. 5వేల కోట్ల కుంభకోణంపై మానీలాండరింగ్‌ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.