
ఆరోగ్య భారతి అఖిల భారతీయ కార్యదర్శి డాక్టర్ మురళి కృష్ణ గారి చేతుల మీదుగా కోవిడ్ కాల్ సెంటర్ ప్రారంభించ బడినది . జూమ్ మీటింగ్ ద్వారా షుమారు వంద మంది డాక్టర్లతో జరిగిన సమావేశంలో శ్రీ మురళి కృష్ణ కాల్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో అనేక మంది కోవిడ్ బారిన పడుతున్నారని, వారందరికీ ఉపయుక్తంగా ఉండేలా ఆరోగ్య భారతి, సేవా భారతి లు సంయుక్తంగా ఈ కోవిడ్ కాల్ సెంటర్ ను ప్రారంభిస్తున్నాయని తెలిపారు. ఈ హెల్ప్ లైన్ ద్వారా బాధితుల సహాయార్థం షుమారు 200 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారని. వారందరూ స్వచ్చందంగా తమ సేవలను అందించటానికి ముందుకు వచ్చారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సేవా భావంతో నిస్వార్థంగా బాధితులకు తమ సేవలను అందించటానికి ముందుకు వచ్చిన వైద్యులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
“040 – 4821 – 4920 నెంబరుకు కాల్ చేసి అందుబాటులో ఉన్న డాక్టరు గారి సూచనలు, సలహాలు పొందవచ్చు. 040 – 4821 – 4920 నంబరును మొబైల్ లో సేవాభారతి కోవిడ్ కాల్ సెంటర్ పేరుతొ సేవ్ చేసుకుంటే అవసరమైన సమయంలో ఫోన్ చేసి డాక్టరు గారి సలహా పొందవచ్చు. ఒక మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. మీ పేరు కాల్ సెంటర్ లో రిజిస్టర్ అవుతుంది.” అని ఆంధ్రప్రదేశ్ ప్రాంత సేవా ప్రముఖ్ శ్రీ పృధ్విరాజు తెలిపారు. కాల్ సెంటర్ ఉదయం 9.00 నుండి రాత్రి 9.00 వరకు పనిచేస్తుంది . కాల్ సెంటర్ లో ముగ్గురు పనిచేస్తున్నారు. ఒకరు విజయవాడ నుండి ఇద్దరు విశాఖపట్నం నుండి పని చేస్తున్నారు . ఈ నంబెర్ ని కోవిడ్ సహాయం కోరిన వారికి ఇచ్చి అందరికీ సహాయపడవలసినదిగా నిర్వాహకులు కోరుతున్నారు.






