News

అయోధ్య భూమి పూజ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలి : ఎంపీ రఘురామ కృష్ణం రాజు

226views

యోధ్యలో రామాలయం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 5న చేయనున్న భూమిపూజ భారత దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

”కోట్లాది ప్రజల చిరకాలవాంఛ అయోధ్యలో రామాలయం నిర్మాణం. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరిగే రోజు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలి. దేవాదాయశాఖ పరిధిలోని 24వేల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, వేద పఠనం చేయాలి. భూమిపూజ కార్యక్రమాన్ని తితిదే ఆధ్వర్యంలోని ఎస్వీబీసీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలి” ఈమేరకు దేవాదాయశాఖను సీఎం జగన్‌ ఆదేశించాలని కోరుతూ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.