
800views
ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో అయిదుగురు గుర్తుతెలియని మిలిటెంట్లను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. వివరాల్లోకి వెళితే జమ్మూ-కశ్మీర్‌లోని షోపియన్ జిల్లా, రిబాన్ ప్రాంతంలో మిలిటెంట్లు ఉన్నట్టు భద్రతాదళాలకు పక్కా సమాచారం అందింది. దీంతో వారు అక్కడకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. వీరి రాకను గమనించిన మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. వారిని నిలువరించేందుకు భద్రతా దళాలు కాల్పులు ఆరంభించిన కాసేపటికే మిలిటెంట్లు అయిదుగురు హతమయ్యారు. వీరు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో తేలాల్సిఉందని, మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సీనియర్ పోలీస్ అధికారి పేర్కొన్నారు.





