News

అరుదైన హిమాలయ పక్షుల బొమ్మలతో వెండి నాణేలు

750views

పర్యావరణ దినోత్సవ(జూన్‌ 5) సందర్భాన్ని పురస్కరించుకుని డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా (World Wide Fund for Nature India ) తో కలిసి ఎమ్‌ఎమ్‌టీసీ (Metals and Minerals Trading Corporation )-పాంప్‌ (Produits Artistiques Métaux Précieux, Switzerland.) పరిమిత సంఖ్య(లిమిటెడ్‌ ఎడిషన్‌)లో వెండి నాణేలను విడుదల చేసింది. వీటిపై అంతరించిపోతున్న నాలుగు హిమాలయ పక్షుల బొమ్మలను ముద్రించారు. 999.9 నాణ్యత గల వెండి నాణేలపై స్కార్లెట్‌ మినివెట్‌, నీలం గొంతున్న బార్బెట్‌, నల్లటి తోక ఉండే టిట్‌, బ్లూ మాగ్పీలను అందంగా చెక్కినట్లు ఎమ్‌ఎమ్‌టీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.