News

సక్షమ్ ఆద్వర్యంలో అనాధలకు, హెచ్.ఐ.వి బాధితులకు దుస్తులు, మిఠాయిలు, సబ్బుల పంపిణీ

852views

క్షమ్ (సమదృష్టి, క్షమతా వికాస్ ఏవం అనుసంధాన్ మండలి) దివ్యాంగుల కోసం పని చేస్తున్న అఖిల భారత సంస్థ ఆద్వర్యంలో మాజీ పారా మిలిటరీ (CISF) ఉద్యోగి, సమాజ సేవకులు శ్రీ నోటి మాల్యాద్రి రెడ్డి మనుమరాలు చిరంజీవి మధు పూర్ణిమ జన్మదినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా బోగోలు మండలం కడనూతల జాతీయ రహదారి పక్కన ఉన్న భవాని ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారిచే నిర్వహింపబడుతున్న హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్తుల మరియు అనాధ పిల్లల శరణాలయంలో ఉన్న వారందరికీ కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత మంత్రిత్వ శాఖ జాతీయ నిధి పర్యవేక్షణ కమిటీ సభ్యులు శ్రీ వెన్నపూస శ్రీనివాసులు రెడ్డి గారి చేతుల మీదుగా దుస్తులు, స్వీట్లు, సబ్బులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శ్రీ శ్రినివసులరెడ్డి మాట్లాడుతూ మన కుటుంబాలలో నిర్వహించుకునే శుభకార్యాల సందర్భంగా ఇటువంటి అభాగ్యులకు సహాయం చేయటం మంచి సాంప్రదాయమని, ఈరోజు ఇక్కడ ఉండే పిల్లలందరికీ కావలసిన వస్తువులు సమకూర్చిన శ్రీ నోటి మాల్యాద్రి రెడ్డి గారి దాతృత్వం ప్రశంసనీయమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ తమ ఇండ్లలో జరిగే శుభ సందర్భాలను ఇలాంటి మంచి మంచి సేవా కార్యక్రమాలతో జరుపుకొని అభాగ్యులకు ఆపన్న హస్తం అందించాలని పిలుపునిచ్చారు. పిల్లలు ఎవరూ కూడా అధైర్య పడకుండా మనోధైర్యంతో ముందుకు సాగాలని దాతల సహాయాన్ని ఉపయోగించుకొని ప్రయోజకులుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి వీరబ్రహ్మయ్య, వడ్డే శ్రీనాథ్ రెడ్డి, మల్లం కొండారెడ్డి, భవాని ట్రస్ట్ నిర్వాహకులు సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.