News

కరుడుగట్టిన ఉగ్రవాది అబ్దుల్‌ మాలిక్‌ హతం

811views

రుడుగట్టిన ఉగ్రవాది, అల్‌ ఖైదా ఉత్తర ఆఫ్రికా చీఫ్‌ అబ్దుల్‌ మాలిక్‌ హతమయ్యాడు. నార్త్‌ అల్జీరియాలోని పర్వత సానువుల్లో తలదాచుకున్నట్లు ముందస్తు సమాచారం అందడంతో ఫ్రెంచ్‌ బలగాలు స్థానిక సైన్యంతో కలిసి దాడులు నిర్వహించాయి. ఉత్తర మాలి, అల్జీరియా తదితర ప్రాంతాలల్లో ఏకకాలంలో దాడులు చేశాయి. ఈ దాడుల్లో అబ్దుల్‌ మాలిక్‌ ప్రాణాలు కోల్పోయినట్లు ఫ్రాన్స్‌ ప్రకటన విడుదల చేసింది. గత ఏడు సంవత్సరాలుగా మాలితోపాటు ఫ్రెంచ్‌ సైన్యాలు అబ్దుల్‌ మాలిక్‌ కోసం గాలిస్తున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.