News

News

కశ్మీర్‌లో హిందువులను ఉగ్రవాదుల నుంచి రక్షించాలి: డచ్ ప్రధాని

జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో జూన్ 10న ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసిన ఘటనపై నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గీర్ట్ విల్డర్స్ తీవ్రంగా స్పందించారు. ‘‘భారతదేశమా, హిందువులను చంపేందుకు కశ్మీర్ ‌లోయలోకి పాకిస్తానీ ఉగ్రవాదులను రానీయవద్దు. మీ దేశ ప్రజలను కాపాడుకో’’ అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేసారు. రియాసీ జిల్లాలో పాకిస్తానీ ఉగ్రవాదుల దాడిలో 9మంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌లో ఉగ్రవాదం గురించి గీర్ట్ విల్డర్స్ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో హిందువుల దురవస్థల గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. మహమ్మద్ ప్రవక్త మీద వ్యాఖ్యల విషయంలో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ వైఖరిని ఆయన సమర్ధించారు. గీర్ట్ విల్డర్స్ ఈ యేడాది మొదట్లో నూపుర్ శర్మతో ఫోన్‌లో సంభాషించారు. ఆమెను భారతదేశానికే కాక మొత్తం...
News

తిరుమలలో ప్రతి నిత్యం గోవింద నామ స్మరణ ప్రతి ద్వనించాలి

గురువారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రతి రోజు శ్రీవేంకటేశ్వర స్వామి స్మరణతోనే తనకు రోజు ప్రారంభమవుతుందన్నారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, తన పాఠశాల, కళాశాల రోజుల్లో శ్రీనివాసమంగాపురం, తిరుపతికి నడిచి వెళ్లే...
News

ఉగ్రవాదులను ఉరితీయాలి

కాశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న భక్తులపై కాల్పులు జరిపి వారి ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులను బహిరంగంగా ఉరితీయాలని విశ్వహిందూ పరిషత్‌ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గోరంట్ల రమణ డిమాండు చేశారు. కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన నిర్వహించి, ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు....
News

టిబెట్ లోని 30 ప్రాంతాల పేర్లను మార్చేందుకు రెడీ అవుతున్న భారత్

చైనాకు బుద్ధి చెప్పేందుకు కేంద్రం రెడీ అవుతున్నట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. టిబెట్‌ లో స్వతంత్రంగా వున్న ప్రాంతంలోని 30 కి పైగా వున్న స్థలాలకు పేర్లు మార్చాలని భారత ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం అరుణాచల్‌...
News

అంగారకుడిపై అగ్నిబిలానికి భారత శాస్త్రవేత్త దేవేంద్రలాల్ పేరు

అంగారక గ్రహంపై ఇటీవల కనుగొన్న మూడు అగ్నిబిలాల్లో ఒకదానికి దివంగత, ప్రఖ్యాత కాస్మిక్ కిరణ భౌతిక శాస్త్రవేత్త దేవేంద్ర లాల్ పేరు పెట్టారు. మిగిలిన రెండు బిలాలకు ఉత్తర్ ప్రదేశ్లోని ముర్సాన్ పట్టణం, బీహార్లోని హిల్సా టౌన్ పేర్లను పెట్టారు. ఆ...
News

కోర్టులో పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని బెదిరించిన నిందితుడు గ్యాంగ్‌‌స్టర్ జయేష్ పూజారీ.. బుధవారం కోర్టులో పాకిస్థాన్ అనుకూలంగా నినాదాలు చేశాడు. దీంతో అతడిని పోలీసులు బలవంతంగా కోర్టు నుంచి బయటకు తీసుకెళ్లారు. అనంతరం అతడిని ఏపీఎంసీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అందుకు...
News

జ్యోతిర్మఠ్‌గా మారిన జోషిమఠ్

ఉత్తరాఖండ్‌ లోని ఛమోలి జిల్లా జోషిమఠ్ తహసిల్‌ పేరు అధికారికంగా మారింది. జోషిమఠ్‌ ఇక నుంచి 'జ్యోతిర్మఠ్'గా పేరుమార్పు సంతరించుకుందని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఒకప్పుడు జ్యోతిర్మఠ్‌గానే ఈ పేరు వాడుకలో ఉండేది. క్రమంగా ఆ పేరు 'జోషిమఠ్'గా రూపాంతరం చెందింది....
News

పాక్‌ ఉగ్రవాదికి క్షమాభిక్ష తిరస్కరణ

ఎర్రకోటపై దాడి కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ ఉగ్రవాది మొహమ్మద్‌ ఆరిఫ్‌ అలియాస్‌ అష్ఫాక్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. అధికార వర్గాలు బుధవారం ఈ విషయాన్ని వెల్లడించాయి. 2000 డిసెంబరు 22న ఎర్రకోట ఆవరణలోని 7 రాజ్‌పుతానా...
1 1,436 1,437 1,438 1,439 1,440 3,070
Page 1438 of 3070