అందాల టిబెట్ ను రక్షించుకుందాం – సరిహద్దులను పటిష్టం చేసుకుందాం
తే22/1/2019ది మంగళవారం విజయవాడలోని సిద్దార్ధ ఫార్మసీ కళాశాలలో “ భారత్ కు టిబెట్ సమస్య ఎంత ముఖ్యమైనది?” అనే అంశంపై చర్చా వేదిక నిర్వహించారు. ఈ సదస్సులో టిబెట్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ ఆచార్య యాషి మాట్లాడుతూ కళలు, శాస్త్రాలు, సాంప్రదాయాలు, సంస్కృతి ఇలా అన్ని విషయాలలో భారత్, టిబెట్ ల మధ్య ఎంతో సారూప్యం వున్నదని, చైనా టిబెట్ ను దురాక్రమించాలని చూస్తున్న ఈ తరుణంలో భారత్ తన సంపూర్ణ సహకారాన్ని టిబెట్ కు అందించాల్సిన అవరమున్నదని తెలిపారు. ప్రపంచంలో చాలా దేశాలు సుఖ శాంతులతో మనుగడ సాగిస్తున్నాయని శాంతి కాముకులైన ప్రజలున్న టిబెట్ లో మాత్రం శాంతి లేదని, భారత్ అంతర్జాతీయ వేదికలపై చైనా దుర్నీతిని ఎండగట్టాలని, ఆ విషయంలో భారత్ టిబెట్ కు సహకరించాలని వారు తెలిపారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ పలుచోట్ల ఈ...