
అమృత్‌సర్: అమృత్‌సర్ ప్రాంతంలోని భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఆదివారం రాత్రి సరిహద్దు భద్రతా దళం మరో డ్రోన్ ను కూల్చివేసింది. క్వాడ్-కాప్టర్ స్పోర్టింగ్ డ్రోన్‌ను కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో గత మూడు రోజుల్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇది రెండోది. 12 కిలోల బరువున్న ఈ డ్రోన్‌లో నాలుగు ప్రొపెల్లర్లు ఉన్నాయి. అమృత్‌సర్ సెక్టార్‌లోని రానియా సరిహద్దు పోస్ట్ సమీపంలో రాత్రి 9.15 గంటలకు బీఎస్‌ఎఫ్ 22వ బెటాలియన్ దళాలు డ్రోన్ ను గమనించి.. కాల్చివేసినట్టు అధికారులు తెలిపారు. డ్రోన్ ద్వారా రవాణా చేయబడిన కొంత సరుకు కూడా రికవరీ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు.
డ్రోన్‌లో ఏదో సరుకు ఉంది.. బీఎస్‌ఎఫ్ అధికారులు అందులో ఏమి ఉందనే వివరాలను వెల్లడించలేదు. బీఎస్ఎఫ్ అధికారులు కూడా అది పాకిస్తాన్ డ్రోన్ కాదా అనేది నిర్ధారించలేదు. రెండు రోజుల క్రితం, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లోని ఇండో-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో పాకిస్తాన్ డ్రోన్‌ను కూల్చివేసింది.
Source: NationalistHub