కుటుంబ వ్యవస్థతోనే సమాజ ఉన్నతి
అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఏటా మే 15న విశ్వవ్యాప్తంగా జరుపుకొంటున్నాం. సమాజం సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, సమాజంలో మానవ, కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయి. సమాజంలో అనేక అవాంఛిత ధోరణులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న విషయాన్ని గుర్తించి, ఉమ్మడి కుటుంబాల ఆవశ్యకతను వివరించడం కోసం ఈ రోజును అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు మూలం మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. కుటుంబాల్లో పెద్దల సంరక్షణలో పిల్లలు సురక్షితంగా, ఆనందంగా ఉండేవారు. కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయులు, ఆపదలో ఆదుకునే బంధు మిత్రులతో ఒంటరితనం అనే భావన లేకుండా ఆనందంగా గడిపేవారు. కానీ నేడు, ఉమ్మడి కుటుంబాలనేవే లేకుండాపోయాయి. ఆధునిక ప్రపంచంలో చిన్న కుటుంబాలుగా మారాయి. నేడు ఉమ్మడిగా రెండు కుటుంబాలు కాదు కదా, రెండు మనసులు కూడా కలిసి జీవించలేని పరిస్థితి...





