News

అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ

279views

వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్‌ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోద ముద్ర అనంతరం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ నియామకాన్ని చేపట్టింది. నయీమా ఏఎంయూకు తొలి మహిళా వీసీ. అయిదేళ్లపాటు ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. ఏఎంయూలోనే సైకాలజీలో పీహెచ్‌డీ పూర్తిచేసిన నయీమా.. అదే విభాగంలో లెక్చరర్‌గా 1988లో ఎంపికయ్యారు. 2006లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. 2014 నుంచి మహిళా కళాశాల ప్రిన్సిపల్‌గా కొనసాగుతున్నారు. ఆమె భర్త ప్రొఫెసర్‌ మహమ్మద్‌ గుల్రెజ్‌ నిరుడు ఏఎంయూ తాత్కాలిక వీసీగా బాధ్యతలు చేపట్టారు. 1920లో బేగమ్‌ సుల్తాన్‌ జహాన్‌ ఏఎంయూ కులపతిగా పనిచేశారు.