NewsSeva

గిరిజనులకు ఉచిత వైద్య పరీక్షలు

74views

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని జానాలగూడెం, బలపాల తిప్ప గూడేలలో సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఐఎంఎ మహిళ వైద్యుల తోడ్పాటుతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో వృద్ధులకు కంటి శుక్లం ఆపరేషన్లకు, 2 సంవత్సరాల చిన్నారికి హెర్నియా శస్త్ర చికిత్సలు చేయవలసిన అవసరాన్ని గుర్తించారు. వారికి నంద్యాలలో సంబంధిత వైద్యులను సంప్రదించి ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేస్తామని వైద్యులు తెలిపారు. వీరితో పాటు ఇతర వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.మిగిలిన వారికి మందులు, పోషకా హారం ఆవశ్యకత, వ్యక్తిగత పరిశుభ్రత తదితర జాగ్రత్తలు తెలియ జేశారు.

కార్యక్రమంలో డాక్టర్లు ఎం.నర్మదా, హరిత, స్ఫూర్తి రెడ్డి, వకుల్ల క్రాంతి, భాగ్యలక్ష్మి, కాదర్ బాద్ ఉదయ్ శంకర్, కాదర్ బాద్ సత్య శివ సుందరిలతో పాటు సేవా భారతి సంయోజకులు వాసుదేవ రెడ్డి, సేవా ప్రముఖ్ శ్రీనివాస్, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.