NewsProgramms

వైభవంగా SSF వసంత నవరాత్రి ఉత్సవాలు…

113views

సనాతన ధర్మమే మన జీవన విధానం అని సమాజానికి గుర్తు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్న సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్రంలోని 500 రెవెన్యూ మండలాల్లో వసంత నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు తొమ్మిది రోజుల పాటు ప్రతి రోజూ సాయంత్రం 7.00 గంటల నుండి 8.00 గంటల వరకు అన్ని గ్రామాలలో ఒకే సమయంలో ఈ ఉత్సవాలు నిర్వహించడం విశేషం.

ప్రతి రెవెన్యూ మండలంలోని ఐదు పంచాయతీలలో గ్రామ ధార్మిక సమితుల ఆధ్వర్యంలో ఉత్సవాలను జరిపించారు. ఉగాది నాడు పంచాంగ శ్రవణంతో మొదలు పెట్టి హనుమాన్ చాలీసా, భజన, సత్సంగం, సామూహిక హారతి, సంకీర్తన, విజయ మహా మంత్రం, శ్రీరాముని కథ, శ్రీరామ కార్యంలో హనుమంతుని పాత్ర, 8వ రోజు అన్ని గ్రామాలలో అయోధ్య రామ మందిరం ఉద్యమం మరియు జనవరి 22వ తారీకు జరిగిన బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం గురించి వివరించారు.

చివరిగా సీతారాముల కళ్యాణం..ఇలా తొమ్మిది రోజుల పాటు వివిధ కార్యక్రమాలను 2500 పై చిలుకు పంచాయితీలలోని 5000లకు పైగా దేవాలయాల్లో సమరసత సేవా ఫౌండేషన్ గ్రామ ధార్మిక సమితి కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామ గ్రామాన కలశ యాత్రలు, పల్లకి యాత్రలు, నగర /గ్రామ సంకీర్తన శోభాయాత్రలు ఘనంగా జరిగాయి. ఈ ధార్మిక కార్యక్రమాల్లో ఆయా గ్రామాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నవరాత్రి ఉత్సవాలను జయప్రదం చేశారు.