News

News

సీఏఏ కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లు

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు. పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో వేధింపులకు గురైన ముస్లిమేతర వలసదారులు భారతీయులుగా గుర్తింపు పొందారు. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా 14 మంది దరఖాస్తుదారులకు పౌరసత్వ ధృవీకరణ పత్రాలు అందజేశారు. బుధవారం సీసీఏ కింద ఢిల్లీలోని 300 మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లు అందజేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. కాగా, పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో వేధింపులకు గురై భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతర ప్రజలకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే ప్రక్రియను 2019లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టింది. దీని కోసం పౌరసత్వ చట్టాన్ని సవరించింది....
News

‘పీఓకే’లో ఆందోళనలపై మంత్రి జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు

పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌(పీఓకే) ఎప్పటికీ భారత్‌దేనని విదేశాంగశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం పీఓకేలో జరుగుతున్న ఆందోళనలపై కోల్‌కతాలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ‌జైశంకర్‌ స్పందించారు. పీఓకేలో ఉన్న ప్రజలు తమ జీవన ప్రమాణాలు, జమ్మూకాశ్మీర్‌లో ఉన్న ప్రజల జీవన...
News

నేటి నుంచి నిర్మాల్య చందనం విక్రయాలు

సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా ఈనెల 10వ తేదీన అప్పన్న స్వామి దేహంపై నుంచి వేరుచేసిన నిర్మాల్య చందనం విక్రయాలు గురువారం నుంచి ప్రారంభించనున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18వ తేదీ మినహా 21వ తేదీ...
News

‘పీవోకే’ భారత్‌లో భాగమే.. మేం దానిని చేజిక్కించుకుంటాం

కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిరసనలను ప్రస్తావిస్తూ.. పీవోకే భారత్‌లో భాగమే. మేం దానిని తీసుకుంటామని 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఒకప్పుడు సమస్యాత్మకమైన కాశ్మీర్‌లో శాంతి నెలకొందని అన్నారు. ఇప్పుడు పాక్...
News

నందీశ్వర స్వామికి విశేష పూజలు

శ్రీశైలం మహాక్షేత్రంలో మంగళవారం లోకకళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్య (కుమారస్వామి) స్వామికి, నందీశ్వరస్వామికి, బయలు వీరభద్రస్వామికి విశేష పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో దేశం శాంతిసౌభాగ్యాలతో విరిసిల్లాలని అర్చకస్వాములు సంకల్పం పఠించారు, అనంతరం పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహా గణపతిస్వామికి...
ArticlesNews

900 ఏళ్ల చరిత్ర.. తిరుపతి గంగమ్మ జాతర విశిష్టత ఇదే..

రాష్ట్రంలో జరిగే ప్రముఖ జాతరల్లో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతీ ఏటా మే నెలలో ఏడు రోజుల పాటు జాతర నిర్వహించటం జరుగుతుంది. నిన్న అర్థరాత్రి చాటింపుతో తిరుపతి గ్రామ దేవతగా పిలుచుకొనే చిన్నగంగమ్మ జాతర...
News

మే 22న తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలు, భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు మే 22వ తేదీన తిరుమలలో వైభవంగా జరుగనున్నాయి. వెంగమాంబ స్వస్థలమైన తరిగొండ, తిరుమల, తిరుపతి దివ్యక్షేత్రాలలో జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. మే 22వ...
News

త్యాగరాజ కృతి వైభవాన్ని చాటిన కచేరీలు

సద్గురు త్యాగరాజ స్వామి జయంతి సందర్భంగా సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంగీతోత్సవాలు త్యాగరాజ స్వామి కృతి వైభవాన్ని చాటుతున్నాయి. సోమవారం నాటి కార్యక్రమంలో బి. హర్షిత త్యాగరాజ స్వామి రచించిన సంకీర్తనలు ఆలపించారు. యువ సంగీత కళాకారులు అంబ టిపూటి రామలక్ష్మి, సుబ్రహ్మణ్య మహతి, సంగీత సమితి, తాడేపల్లి శాంకరి, మల్లాది అనన్య, మల్లాది అభిజ్ఞ గాత్రంతోనూ.. పారుపల్లి ఇభానన్ మాండోలిన్, ప్రభానన్ వేణువుతో, ఏబీటీ సుందరి వీణతోనూ త్యాగరాజ స్వామి కృతులను ఆలపించారు. విఖ్యాత సంగీత విద్వాంసులు వేమూరి విశ్వనాథ్, పోపూరి గాయత్రి గౌరీనాథ్ మల్లాది సూరిబాబులు సంకీర్తనలను ఆలపించి తమ భక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు బీవీఎస్ ప్రకాష్, ఉపాధ్యక్షుడు బి. హరి ప్రసాద్, కార్యదర్శి గౌరీనాథ్ పాల్గొన్నారు...
News

భగవద్గీతపై రాసిన భాష్యాన్ని విడుదల చేసిన ఉపరాష్ట్రపతి

దేశ ప్రజలు జాతి ప్రయోజనాలను అన్నిటికంటే ఎక్కువగా అత్యధిక ప్రాధాన్యతతో అనుసరించాలని ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్కడ్ చెప్పారు. సుభాష్ కశ్యప్ సందర్భంగా ఆయన మాట్లాడారు భగవద్గీత ఆధ్యాత్మికత, మతం పట్ల శ్రద్ధ, ధర్మం విధి పట్ల అంకిత భావం గురించి ముందుకు సాగే మార్గాన్ని చూపుతుందని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు....
News

గాజాపై ఇజ్రాయెల్‌ దాడిలో భారతీయుడు మృతి

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో గాజాలోని రఫా నగరంపై జరిగిన దాడిలో ఐక్యరాజ్యసమితిలో పనిచేసే ఓ భారతీయుడు మృతిచెందారు. యునైటెడ్‌ నేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ (డిఎస్ఎస్) విభాగంలో పనిచేస్తున్న ఆ వ్యక్తి తన వాహనంలో రఫాలోని యూరోపియన్‌ దవాఖానకు వెళ్తుండగా దాడి జరిగింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తున్నది. ఆయతో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వ్యక్తి భారత్‌కు చెందిన మాజీ సైనికుడని తెలుస్తున్నది. కాగా, ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రెస్‌ స్పందించారు. “ఐరాసకు చెందిన డీఎస్‌ఎస్‌ విభాగంలోని సభ్యుడు మరణించడం చాలా బాధాకం. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు....
1 … 1,249 1,250 1,251 1,252 1,253 … 2,510
Page 1251 of 2510