శ్రీశైలం దేవస్థానంలో భక్తుల నుంచి అదనంగా టికెట్ రుసుం వసూలు చేస్తున్నారు. అభిషేక కర్తలతో పాటు అదనంగా వచ్చే వారికి టికెట్ రేటు పెంచి విక్రయిస్తున్నారు. సాధారణంగా అభిషేకం టికెట్ ధర రూ.1500. దంపతులతోపాటు అదనంగా వచ్చే వారికి రూ.500 చొప్పున...
విశాఖపట్నం సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో రెండో విడత చందనం అరగదీత ఘనంగా ప్రారంభమైంది. ఈనెల 23న వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని ఆరోజు తెల్లవారుజామున స్వామికి సమర్పించనున్న మూడు మణుగుల పచ్చిచందనం (120 కిలోలు) సమకూర్చేందుకు అరగదీత కార్యక్రమం చేపట్టారు....
(మే 20 - టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి) కొదమసింహంలా స్వాతంత్య్రం కోసం సమరం చేసిన మన కేసరి టంగుటూరి ప్రకాశంపంతులు. ఆయన మన మొదటి ముఖ్యమంత్రి. తుది వరకూ దేశం కోసం, జనం కోసం పరితపించిన తపస్వి. మద్రాసులో సైమన్ కమీషన్ను ఎదిరించిన సందర్భంలో తుపాకీకి రొమ్ము చూపించిన ఘనుడు. ఈయన దెబ్బకు తట్టుకోలేక వారే వెన్నుచూపించి వెళ్లిపోయారు. అందుకే ప్రకాశంను ‘ఆంధ్రకేసరి’ అని ప్రజలంతా గొంతెత్తి పిలుచుకున్నారు. గోపాలకృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు 23 ఆగస్ట్ 1872న ప్రకాశం పంతులు జన్మించారు. అతి సాధారణ కుటుంబంలో పుట్టి, ఆధునికాంధ్ర ప్రజానాయకుల్లో అసాధారణంగా ఎదిగి, ప్రజలే ప్రకాశం, ప్రకాశమే ప్రజలు అనిపించుకున్న నిస్వార్థ జీవి. ప్రకాశం జీవితం, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, స్వాతంత్ర్య ఉద్యమం వేరువేరు కావు. స్వాతంత్ర్య సమర యోధుడుగా ఎంతటి విజయాన్ని సాధించాడో, న్యాయవాదిగానూ వృత్తిలో...
భారత్ లో హిందువుల వాటా గత కొన్ని దశాబ్దాలుగా తగ్గినట్టు ప్రధాని ఆర్థిక సలహా మండలి (పీఎమ్- ఈఏసీ) నేతృత్వంలో జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. పొరుగు దేశాల్లో మాత్రం ఇందుకు భిన్నమైన గణాంకాలు నమోదు అయ్యాయి. అక్కడ మెజారిటీ మతస్తుల...
శ్రీలంక నువారా ఏలియాలోని అశోకవనం ప్రాంతంలో ‘సీత అమ్మ మందిరం’ నిర్మాణం జరుగుతోంది. ఆ ఆలయంలో సీతామాత ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అయోధ్య నుంచి పవిత్ర సరయూ జలాలను, మరికొన్ని కానుకలను పంపిస్తున్నారు. శ్రీలంకలో రావణాసురుడు సీతమ్మను బంధించిన అశోకవనం ప్రదేశంలోనే ఆ...
భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై అమెరికా ప్రశంసలు కురిపించింది. భారత్ శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశమని అభివర్ణించింది. భారత్లో ప్రజాస్వామ్య పద్ధతిలో సువ్యవస్థితంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ విధానం అత్యంత ప్రత్యేకమైందని వైట్ హౌజ్ పేర్కొంది. భారత్ కంటే శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశం...
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) మరో కొన్ని నెలల్లో భారత్లో విలీనమవుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అన్నారు. అయితే, నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటేనే అది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. శనివారం పాల్ఘర్లో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న...
తమిళనాడులోని కాంచీపురం సమీప ఏణాత్తూర్లోని పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహా విద్యాలయం ప్రాంగణంలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఆదిశంకరుడి 2500వ వార్షిక ముక్తి పొందిన దినోత్సవం సందర్భంగా ఆయన పాదయాత్ర సమయాల్లో తయారు చేసిన గ్రంథాలకు సంబంధించి సంస్కృత, భారత కళాచారం విభాగాల తరఫున మూడురోజుల పాటు కొనసాగే జాతీయ సదస్సు ప్రారంభోత్సవం శనివారం సాయంత్రం ఇక్కడి గ్రంథాలయ భవనంలో జరిగింది. కంచి కామ కోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులతో విశ్వవిద్యాలయ కులపతి వి.కుటుంబశాస్త్రి అధ్యక్షతన నిర్వహించిన సదస్సు ప్రారంభోత్సవంలో విశిష్ట అతిథిగా రాష్ట్ర గవర్నరు ఆర్.ఎన్.పాల్గొని మాట్లాడారు. శంకర విజయేంద్ర సరస్వతి అనుగ్రహభాషణ చేశారు. సదస్సులో పాల్గొన్న వారికి తొలుత గవర్నర్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని నిలువెత్తు భారీ ఆదిశంకరుడి విగ్రహానికి పుష్పాంజలి నిర్వహించారు...
తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సారె పంపారు. శనివారం సాయంత్రం శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీ గంగమ్మ గుడికి వెళ్ళి సారె అందజేశారు.తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సోదరిగా చెబుతారు. జాతర సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి గంగమ్మ తల్లికి సారె సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది....