News

News

22న తిరువన్నామలైకి ప్రత్యేక బస్సులు

అరుణాచలగిరి ప్రదక్షిణ కోసం ఈనెల 22వ తేదిన తిరువన్నామలైకి కడప రీజియన్‌ పరిధిలోని వివిధ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని వైయస్సార్ జిల్లా ప్రజా రవాణాధికారి గోపాల్‌రెడ్డి తెలిపారు. కడప డిపో నుంచి రాత్రి 8 గంటలకు రాయచోటి, చిత్తూరు,...
News

ద్వారకా తిరుమలలో వైభవంగా వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు

ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు సోమవారం స్వామివారు కాళీయమర్ధన ఆలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి ఆలయ యాగశాలలో అర్చకులు పుట్టమన్ను తెచ్చి పొలికల్లో పోసి...
News

వాట్సాప్‌లో ట్రిపుల్ తలాక్ ఇచ్చిన వ్యక్తి అరెస్ట్

తన భార్యకు వాట్సాప్ మెసేజ్ ద్వారా ట్రిపుల్ తలాక్ ఇచ్చిన ఒక వ్యక్తిని తెలంగాణలోని ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుడు అబ్దుల్ అతీక్ మీద కేసు రిజిస్టర్ చేసారు. ఆదిలాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ ఇనస్పెక్టర్ జి శ్రీనివాస్ కథనం...
News

ప్రజల్ని ప్రేమించనివాడు నాయకుడు కాదు

1928లో సైమన్‌ ‌కమిషన్‌ ‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి మద్రాస్‌ ‌లో జరిగిన ప్రదర్శనలకు బారిస్టర్‌ ‌ప్రకాశం పంతులు నాయకత్వం వహించారు. అప్పటికి ఆయన వయస్సు 56ఏళ్ళు. ప్రదర్శకులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో పార్ధసారధి అనే యువకుడి నెలకొరిగాడు. అతని దగ్గరకు వెళ్లడానికి ఎవరికి ధైర్యం చాలలేదు. ఎందుకంటే ముందుకు వస్తే కాల్చేస్తామని పోలీసులు తుపాకు ఎక్కుపెట్టారు. ‘‘ముందు నన్ను కాల్చి తరువాత వీరిని కాల్చండి’’ అంటూ ప్రకాశం పంతులు ముందుకు నడిచారు. ఇది చూసిన పోలీసులు నిర్ఘాంతపోయి వెనక్కు తగ్గారు. ప్రజలంతా ‘ఆంధ్రకేసరికి జై’ అంటూ నినాదాలు చేశారు. 1921 సహాయనిరాకరణోద్యమంలో హైకోర్ట్ ‌లాయర్‌ ‌ప్రాక్టీసును వదిలిపెట్టారు. అప్పటికి ఆయన నెలకు 6వేల రూపాయలు సంపాదించే వారు. వివిధ నగరాల్లో పెద్దపెద్ద భవంతులు ఉండేవి. మూడు లక్షల రూపాయలు ఉండేవి. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న...
ArticlesNews

విభూతి ధారణ

నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకునేవి కొన్ని ఉంటాయి. వాటిలో ఐశ్వర్యం ఒకటి ధన ధాన్యాదులు మాత్రమే ఐశ్వర్యం కాదు. వ్యక్తుల మనుగడ, ఉన్నతి, అభివృద్ధి, ఆధ్యాత్మిక ఆలోచనలు తదితరాలకు దోహదం చేసేవన్నీ ఐశ్వర్యాలే ఐశ్వర్యాన్ని విభూతి అంటారు. ఇది రెండు రకాలు- భూతి, విభూతి అని ఈ లోకంలో అనుభవానికి వచ్చే సంపదలను 'భూతి' అని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగించే ఆలోచనలను 'విభూతి' అని అంటారు. ఈ రెండు రకాల ఐశ్వర్యాలనూ ప్రసాదించేది భస్మ రూపంలో ఉండే విభూతి ధారణ. విభూతి ధారణ అపమృత్యు భయాన్ని తొలగించి శుభాలు కలగజేస్తుందని, సకల సంపత్కరమైనదని ఒక శ్లోకంలో చెప్పారు పౌరాణికులు. వేదాలు, పురాణాలు విభూతి ధారణ మహిమను ముక్త కంఠంతో చాటుతున్నాయి. భస్మ ధారణ చేసినవారికి దుష్ట గ్రహాలు, పిశాచ పీడలు, రోగాలు, పాపాలు దరిచేరవు. ధర్మబుద్ధి, బాహ్య...
News

ఐఎన్‌ఎస్‌ జలశ్వను సందర్శించిన సీ క్యాడెట్‌ కార్ప్స్‌ క్యాడెట్లు

భారత నౌకాదళం కార్యకలాపాలు, సముద్ర వారసత్వం, లైఫ్‌ ఆన్‌బోర్డ్‌ షిప్‌లపై సమగ్ర అవగాహనే లక్ష్యంగా సుమారు 100 మంది సీ క్యాడెట్‌ కార్ప్స్‌ క్యాడెట్‌లు తూర్పు నావికాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ జలశ్వ ఓడను సందర్శించారు. సందర్శన సమయంలో సీ క్యాడెట్‌ కార్ప్స్‌...
News

ఘనంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు ఆదివారం తిరుమలలో ఘనంగా ముగిసింది. సాయంత్రం శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర క‌ల్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగ‌ళ‌క‌రంగా సంగీత‌, మేళ‌, తాళ వాయిద్యాలను ప్ర‌ద‌ర్శించారు. ఇందులో భైరవి, నళినకాంతి, శంకరాభరణం, హిందూస్థాని, ఖరహరప్రియ,నీలాంబరి రాగాలను సుమధురంగా పలికించారు. అనంత‌రం స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి....
News

వేసవి సెలవుల దృష్ట్యా తిరుమల, శ్రీశైలంలో భక్తుల రద్దీ

రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. తిరుమల, శ్రీశైలం, క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దైవ నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి తిరుమలేశుడి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తో పాటు...
News

వైభవంగా అన్నవరం సత్యనారాయణస్వామి కల్యాణం

కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. రాత్రి 9.30 గంటలకు కల్యాణతంతు ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో సుందరంగా తీర్చిదిద్దిన కల్యాణవేదికపై స్వామి, అమ్మవార్లను, ఆ పక్కనే పెళ్లిపెద్దలు సీతారాముల వారిని ఆసీనులను చేసి కల్యాణం...
News

రోదసిలోకి తెలుగుతేజం

తెలుగు తేజం గోపీచంద్‌ తోటకూర ఆదివారం దిగ్విజయంగా రోదసియాత్ర చేశారు. తద్వారా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్‌ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ సంస్థ రూపొందించిన న్యూషెపర్డ్‌-25 (ఎన్‌ఎస్‌-25) వ్యోమనౌకలో గోపీచంద్‌ ఈ యాత్ర పూర్తిచేశారు. న్యూషెపర్డ్‌ రాకెట్‌కు ఇది ఏడో మానవసహిత అంతరిక్షయాత్ర. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9.36 గంటలకు పశ్చిమ టెక్సాస్‌లోని ప్రయోగ వేదిక నుంచి ఇది నింగిలోకి దూసుకెళ్లింది. దీని ఎగువ భాగంలోని క్యాప్సూల్‌లో ఆరుగురు యాత్రికులు ఆసీనులయ్యారు. భారత తొలి స్పేస్‌ టూరిస్టుగా గుర్తింపు పొందారు. విజయవాడలో పుట్టిన గోపీచంద్‌ తోటకూర.. అట్లాంటా శివారులోని ‘ప్రిజర్వ్‌ లైఫ్‌’ సంస్థకు సహ-వ్యవస్థాపకుడిగా ఉన్నారు. గోపీచంద్‌ పైలట్‌గానూ శిక్షణ పొందారు....
1 … 1,242 1,243 1,244 1,245 1,246 … 2,510
Page 1244 of 2510