News

శ్రీలంక సీతమ్మగుడికి సరయూ జలాలు

55views

శ్రీలంకలో సీతమ్మ ఆలయ ప్రాణప్ర తిష్ఠకు భారత్ నుంచి సరయూనదీ జలాలు వెళుతున్నాయి. సంప్రోక్షణ కార్యక్రమంలో వినియోగించేందుకు అయోధ్యలోని సరయూ జలాలను పంపమని శ్రీలంక ప్రతినిధులు లేఖలో కోరారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ బాధ్యతను పర్యాటకశాఖకు అప్పగించింది. మే 19న శ్రీలంకలో సీతమ్మ ఆలయ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ప్రత్యేక కల శంలో పవిత్ర జలాన్ని శ్రీలంకకు పంపుతున్నట్లు అయోధ్య తీర్థవికాస్ పరిషత్ సీఈవో సంతోష్ కుమార్ శర్మ తెలిపారు. ఈ వేడుక భారత్, శ్రీలంకల మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధానికి ప్రతీ కగా నిలుస్తుందని చెప్పారు. శ్రీలంకలోని సీతమ్మ ఆలయం సనాతన ధర్మానికి ప్రతీకగా ఉంటుందని మహంత్ శశికాంత్ దాస్ తెలిపారు.