News

News

తిరుపతి గంగమ్మ జాతర

తిరుపతి గంగమ్మ ఆలయం భక్తులతో పోటెత్తింది. మంగళవారం గంగ జాతర కావడంతో పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు భక్తులు. ఆలయ ఆవరణలో పొంగళ్ళు పెడుతూ అమ్మవారిని సేవిస్తున్నారు భక్తులు. వివిధ రకాల వేషధారణతో గంగమ్మకు మొక్కులు సమర్పించుకుంటున్నారు భక్తులు. అలాగే సున్నపుకుండలు...
ArticlesNews

శివాజీ నిర్భీతి

భయం ఒక అదృశ్యశక్తి. అది చాలా రకాలుగా బయటపడుతూఉంటుంది.అందుకనే పతంజలి మహర్షి‘‘నిర్భయత్వం సన్యాసి లేదా సాధకుడి ముఖ్యలక్షణం’’అన్నాడు. శివాజీలో ఆ నిర్భయత్వం కనబడుతుంది. రాజాజయ సింగ్‌ను కలవడానికి వెళ్ళినప్పుడు ఒప్పందం ప్రకారం శివాజీ నిరాయుధుడై, కేవలం ఆరుగురు బ్రాహ్మణులను వెంటబెట్టుకుని వెళ్ళాడు....
News

బాలికతో వేంకటరమణుడి నిశ్చితార్థం

రాయదుర్గంలో ప్రతి ఏటా బాలికతో ప్రసన్న వేంకటరమణుడి కల్యాణోత్సవాన్ని జరపటం అరవా తెగకు ఆనవాయితీగా వస్తోంది. పట్టణంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక మార్కండేయ స్వామి ఆలయంలో పురప్రముఖులు, దేవాదాయశాఖ అధికారులు, భక్తుల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పట్టణానికి చెందిన రమేష్, జయమ్మల కుమార్తె మౌనిక(10)తో శ్రీవారి నిశ్చితార్థం చేశారు. ఈనెల 25న ఉదయం 11గంటలకు పట్టణంలోని స్వామివారి ఆలయంలో ప్రజల సమక్షంలో శ్రీదేవి, భూదేవిలతో పాటు బాలికతోనూ వేంకటేశ్వరుడి ఉత్సవ విగ్రహంతో కల్యాణం చేయనున్నారు. స్వామివారి తరఫున ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలాక్షిరెడ్డి, దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మేళతాళాలతో ఊరేగింపుగా కుమార్తె ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అలంకరించిన మౌనికను తల్లిదండ్రులు, బంధువులతో ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకువచ్చి, అర్చకులు బాలికతో వేంకటరమణుడి(కలశం)తో నిశ్చితార్థం చేశారు. నిశ్చితార్థం అనంతరం స్వామివారి...
News

శ్రీలంక ఆలయంలో సరయు నదీ జలాలతో కుంభాభిషేకం…తిరుపతి నుంచి ప్రసాదం

శ్రీలంకలోని సీతా అమ్మన్ ఆలయానికి ఆదివారం నిర్వహించిన కుంభాభిషేకం కార్యక్రమంలో శ్రీలంక, భారత్, నేపాల్ కు చెందిన వేల మంది భక్తులు పాల్గొన్నట్లు భారత హైకమిషన్ 'ఎక్స్' వేదికగా తెలి పింది. సీతా ఎలియా అనే గ్రామంలో జరిగిన ఈ వేడుకలో అయోధ్య నుంచి ప్రవహించే పవిత్రమైన సరయు నది జలాలను ఉపయోగించారు. ఈ కార్యక్రమానికి శ్రీలంకలో భారత హైకమిషనర్ సంతోష్ ఝా, ఆధ్మా త్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ హాజరయ్యారు. భారత్, నేపాల్ దేశాలు అందించిన వస్త్రాలతో పాటు, తిరుపతి నుంచి పంపించిన ప్రసాదాలను సీతా దేవికి సమర్పించడంతో ఈ కార్యక్రమం ముగిసింది....
News

నలుగురు ఐసిస్ అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు…..భారత్ లో విధ్వంసానికి పన్నాగం

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్ర యంలో శ్రీలంకకు చెందిన నలుగురు ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అదుపులోకి తీసుకు న్నారు. కొలంబో నుంచి చెన్నై మీదుగా ఆదివారం...
News

శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్ల జారీ పునఃప్రారంభం…సిఫార్సు లేఖలు స్వీకరిస్తున్న టీటీడీ

ఎన్నికల కోడ్ అమలుతో గత నెల నుంచి ఆగి పోయిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను సోమవారం నుంచి అనుమతిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తిరిగి వీఐపీమల సిఫారుసుపై బ్రేక్ టికెట్ల జారీకి అనుమతించాలన్న టీటీడీ విజ్ఞప్తికి...
News

జల్పాయిగుడిలో రామకృష్ణ మిషన్ ఆశ్రమంపై దుండగుల దాడి

పశ్చిమబెంగాల్ రాష్ట్రం జల్పాయిగుడి జిల్లా లోని తమ ఆశ్రమంపై ఆదివారం కొందరు దుండగులు దాడి చేశారని రామకృష్ణ మిషన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సాయుధులైన దుండగులు ఆశ్ర మంలో ఉన్న సాధువులు, ఉద్యోగులకు తుపాకులు ఎక్కుపెట్టి ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని బెదిరించారని ఆరోపించింది. అనంతరం విధ్వంసానికి పాల్పడ్డా రని, సీసీటీవీ కెమేరాలను పగులగొట్టారని, వెళ్తూవెళ్తూ మెయిన్ గేటుకు తాళం వేశారని పేర్కొంది. తమ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని తెలిపింది. పోలీసులు వచ్చి తాళం బద్దలుకొట్టి సాధువులను, సిబ్బందిని బయటకు తీసుకొచ్చారని తెలిపింది....
ArticlesNews

జయ జయ నృసింహ సర్వేశా

(మే 21 - నృసింహ జయంతి ) నృసింహావతారం ఇతర అవతారాల కంటే భిన్నమైనది. మహాభాగవతం పేర్కొన్న 21 అవతారాలలో ఇది 14వది కాగా, దశావతారాలలో నాలుగది. 'వదునాలుగవదియైన నరసింహ రూపంబున కనక కశిపుని సంహరించె' అన్నారు పోతనామాత్యులు. భగవంతుడు సర్వాంతర్యామి.ఇతర అవతారాల లక్ష్యం నెరవేరినంతనే శ్రీమహావిష్ణువు వైకుంఠానికితరలి వెళితే సర్వవ్యాపకుడైన నృసిహుండు భక్తపాలన కోసం ఇలలోనే ఉండిపోయాడు. నృసింహావతారం సర్వశక్తి సమన్విత స్వరూపం. త్రిమూర్తుల సమన్వయశక్తితో దనుజ సంహారానికి అవిర్భవించిన పరబ్రహ్మ స్వరూపం. 'ఇందుగల డందులేడని సందేహము వలదు/చక్రి సర్వోగతుందెం దుందు వెదకి చూచిన అందందే కలడు....' అన్న ప్రహ్లాదుడిని మాటలను నిజం చేస్తూ సర్వవ్యాపిత్వాన్ని చాటిన అవతారం. 'నృసింహావతారం త్రిమూర్త్యాత్మకం. పాదాల నుంచి నాభివరకు బ్రహ్మ రూపం, నాభి నుంచి కంఠవరకు విష్ణురూపం, కంఠం నుంచి శిరస్సు వరకు రుద్రస్వరూపంగా ఆధ్యాత్మికులు అభివర్ణిం చారు....
News

ఆకాశంలో రాకాసి ఉల్క

స్పెయిన్, పోర్చుగల్‌ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ భారీ ఉల్క భూమిపై పడింది. భూవాతావరణాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చే క్రమంలో అది రాపిడికి లోనై నీలివర్ణపు వెలుగులను వెదజల్లింది. ఫలితంగా రాత్రి సమయం.. పట్టపగలును తలపించింది. ఇది ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఈ ఉల్క వెలుగు కొన్ని వందల కిలోమీటర్ల దూరం కనిపించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఉల్క ఎక్కడ నేలను తాకిందో ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఇది క్యాస్ట్రోడైరో ప్రాంతంలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి....
ArticlesNews

అలరించిన పంచరత్న గోష్టిగానం

‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.. చందురు వర్ణుని అంద చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు’... అంటూ సంగీత విద్వాంసులు త్యాగరాజస్వామి పంచరత్న కృతులను గోష్టిగానం చేసి శ్రోతలను పరమానంద భరితులను చేశారు. శ్రీ త్యాగరాజ స్వామి 257వ జయంత్యుత్సవాల్లో...
1 … 1,241 1,242 1,243 1,244 1,245 … 2,510
Page 1243 of 2510