
గుజరాత్ పోర్‌బందర్‌కు పశ్చిమాన అరేబియా సముద్రంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఓ పడవలో డ్రగ్స్ తరలిస్తున్న 14 మంది పాకిస్థానీయులను భారత తీరరక్షక దళం-ICG అదుపులోకి తీసుకుంది. డ్రగ్స్ తరలింపుపై పక్కా సమాచారంతో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ -ATS, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో -NCB బృందాలతో ICG సంయుక్తంగా తనిఖీలు చేసింది. పాక్ పడవలో 600 కోట్ల రూపాయలు విలువ చేసే దాదాపు 86 కిలోల మాదకద్రవ్యాలు ఉన్నట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుంది.
నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా వారు ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో వారిని చుట్టుముట్టిన అధికారులు 14 మంది పాకిస్థాన్ వ్యక్తులను చేశారు. ఈ ఆపరేషన్‌లో భారత తీరరక్షక దళానికి చెందిన రాజ్‌రతన్ నౌకను వినియోగించారు. మూడేళ్లలో ఇలాంటి 11 విజయవంతమైన ఆపరేషన్లు ఇండియన్ కోస్ట్ గార్డ్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్తంగా చేపట్టాయని ఐసీజీ తెలిపింది.





