
పరమపూజనీయ డాక్టర్ కేశవరావ్ బలి రాంపంత్ హెడ్గేవార్ గారి కలల సామాజిక విరాట్ విశ్వరూపం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విశ్వవ్యాపితమై “పరం వైభవం నేతు మేతత్ స్వరాష్ట్రం” అంటూ శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతున్న తరుణంలో నూతనంగా ఏర్పడిన నంద్యాల జిల్లా కేంద్రంలో ఆర్ఎస్ఎస్ సొంత భవన నిర్మాణానికి భూమి పూజను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ శరీరంలోని ప్రతి అణువూ సంస్కరించబడినపుడే దేహం దృఢంగా ఉంటుందన్నారు. అలాగే సమాజంలోని ప్రతి వ్యక్తి సంస్కరించబడిన అప్పుడే సమాజం సుధృడంగా, సంఘటితంగా ఉంటుంది. సంఘ్ ఒక్క భారత్ దేశానికే కాదు యావత్ ప్రపంచానికి “వసుధైక కుటుంభక స్ఫూర్తిని” చాటుతూ సర్వవ్యాపి యై, సర్వ స్పర్షియై, విశ్వవ్యాపితంగా, అప్రతిహతంగా విశ్వ గురువుగా అవతరించనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విభాగ్ సంఘచాలక్ నీలకంఠేశ్వర్ దంపతులు, జిల్లా సంఘచాలక్ చిలుకూరు శ్రీనివాస్ దంపతులు పూజలో పాల్గొన్నారు.పెద్ద సంఖ్యలో జ్యేష్ట కార్యకర్తలు, మాతృమూర్తులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.





