
392views
నేటి నుంచి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి.దేవ గురువు బృహస్పతి మే 1వ తేదీ నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించాడు. దీంతో నేటి నుంచి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. భారతదేశంలోని పన్నెండు పవిత్ర నదులలో ఒకటైన నర్మదా నదిని పూజించేందుకు, శుద్ధి చేసేందుకు అంకితం చేసే పుష్కరాలు ఇవి.నర్మదా నది పుష్కరాలు మే 1న ప్రారంభమై మే 12 వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. జ్యోతిర్లింగాలలో ఒకటైన మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్ వద్ద నర్మదా నది ప్రవహిస్తున్న ప్రదేశాలలో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు, భక్తులు నర్మదా నదిలో పుష్కర స్నానాలు ఆచరిస్తారు. పూజలు, పిండ ప్రదానాలు, నైవేద్యాలు సమర్పిస్తారు.





