News

News

జల్పాయిగుడిలో రామకృష్ణ మిషన్ ఆశ్రమంపై దుండగుల దాడి

పశ్చిమబెంగాల్ రాష్ట్రం జల్పాయిగుడి జిల్లా లోని తమ ఆశ్రమంపై ఆదివారం కొందరు దుండగులు దాడి చేశారని రామకృష్ణ మిషన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సాయుధులైన దుండగులు ఆశ్ర మంలో ఉన్న సాధువులు, ఉద్యోగులకు తుపాకులు ఎక్కుపెట్టి ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని బెదిరించారని ఆరోపించింది. అనంతరం విధ్వంసానికి పాల్పడ్డా రని, సీసీటీవీ కెమేరాలను పగులగొట్టారని, వెళ్తూవెళ్తూ మెయిన్ గేటుకు తాళం వేశారని పేర్కొంది. తమ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని తెలిపింది. పోలీసులు వచ్చి తాళం బద్దలుకొట్టి సాధువులను, సిబ్బందిని బయటకు తీసుకొచ్చారని తెలిపింది....
ArticlesNews

జయ జయ నృసింహ సర్వేశా

(మే 21 - నృసింహ జయంతి ) నృసింహావతారం ఇతర అవతారాల కంటే భిన్నమైనది. మహాభాగవతం పేర్కొన్న 21 అవతారాలలో ఇది 14వది కాగా, దశావతారాలలో నాలుగది. 'వదునాలుగవదియైన నరసింహ రూపంబున కనక కశిపుని సంహరించె' అన్నారు పోతనామాత్యులు. భగవంతుడు సర్వాంతర్యామి.ఇతర అవతారాల లక్ష్యం నెరవేరినంతనే శ్రీమహావిష్ణువు వైకుంఠానికితరలి వెళితే సర్వవ్యాపకుడైన నృసిహుండు భక్తపాలన కోసం ఇలలోనే ఉండిపోయాడు. నృసింహావతారం సర్వశక్తి సమన్విత స్వరూపం. త్రిమూర్తుల సమన్వయశక్తితో దనుజ సంహారానికి అవిర్భవించిన పరబ్రహ్మ స్వరూపం. 'ఇందుగల డందులేడని సందేహము వలదు/చక్రి సర్వోగతుందెం దుందు వెదకి చూచిన అందందే కలడు....' అన్న ప్రహ్లాదుడిని మాటలను నిజం చేస్తూ సర్వవ్యాపిత్వాన్ని చాటిన అవతారం. 'నృసింహావతారం త్రిమూర్త్యాత్మకం. పాదాల నుంచి నాభివరకు బ్రహ్మ రూపం, నాభి నుంచి కంఠవరకు విష్ణురూపం, కంఠం నుంచి శిరస్సు వరకు రుద్రస్వరూపంగా ఆధ్యాత్మికులు అభివర్ణిం చారు....
News

ఆకాశంలో రాకాసి ఉల్క

స్పెయిన్, పోర్చుగల్‌ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ భారీ ఉల్క భూమిపై పడింది. భూవాతావరణాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చే క్రమంలో అది రాపిడికి లోనై నీలివర్ణపు వెలుగులను వెదజల్లింది. ఫలితంగా రాత్రి సమయం.. పట్టపగలును తలపించింది. ఇది ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఈ ఉల్క వెలుగు కొన్ని వందల కిలోమీటర్ల దూరం కనిపించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఉల్క ఎక్కడ నేలను తాకిందో ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఇది క్యాస్ట్రోడైరో ప్రాంతంలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి....
ArticlesNews

అలరించిన పంచరత్న గోష్టిగానం

‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.. చందురు వర్ణుని అంద చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు’... అంటూ సంగీత విద్వాంసులు త్యాగరాజస్వామి పంచరత్న కృతులను గోష్టిగానం చేసి శ్రోతలను పరమానంద భరితులను చేశారు. శ్రీ త్యాగరాజ స్వామి 257వ జయంత్యుత్సవాల్లో...
News

22న తిరువన్నామలైకి ప్రత్యేక బస్సులు

అరుణాచలగిరి ప్రదక్షిణ కోసం ఈనెల 22వ తేదిన తిరువన్నామలైకి కడప రీజియన్‌ పరిధిలోని వివిధ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని వైయస్సార్ జిల్లా ప్రజా రవాణాధికారి గోపాల్‌రెడ్డి తెలిపారు. కడప డిపో నుంచి రాత్రి 8 గంటలకు రాయచోటి, చిత్తూరు,...
News

ద్వారకా తిరుమలలో వైభవంగా వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు

ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు సోమవారం స్వామివారు కాళీయమర్ధన ఆలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి ఆలయ యాగశాలలో అర్చకులు పుట్టమన్ను తెచ్చి పొలికల్లో పోసి...
News

వాట్సాప్‌లో ట్రిపుల్ తలాక్ ఇచ్చిన వ్యక్తి అరెస్ట్

తన భార్యకు వాట్సాప్ మెసేజ్ ద్వారా ట్రిపుల్ తలాక్ ఇచ్చిన ఒక వ్యక్తిని తెలంగాణలోని ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుడు అబ్దుల్ అతీక్ మీద కేసు రిజిస్టర్ చేసారు. ఆదిలాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ ఇనస్పెక్టర్ జి శ్రీనివాస్ కథనం...
News

ప్రజల్ని ప్రేమించనివాడు నాయకుడు కాదు

1928లో సైమన్‌ ‌కమిషన్‌ ‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి మద్రాస్‌ ‌లో జరిగిన ప్రదర్శనలకు బారిస్టర్‌ ‌ప్రకాశం పంతులు నాయకత్వం వహించారు. అప్పటికి ఆయన వయస్సు 56ఏళ్ళు. ప్రదర్శకులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో పార్ధసారధి అనే యువకుడి నెలకొరిగాడు. అతని దగ్గరకు వెళ్లడానికి ఎవరికి ధైర్యం చాలలేదు. ఎందుకంటే ముందుకు వస్తే కాల్చేస్తామని పోలీసులు తుపాకు ఎక్కుపెట్టారు. ‘‘ముందు నన్ను కాల్చి తరువాత వీరిని కాల్చండి’’ అంటూ ప్రకాశం పంతులు ముందుకు నడిచారు. ఇది చూసిన పోలీసులు నిర్ఘాంతపోయి వెనక్కు తగ్గారు. ప్రజలంతా ‘ఆంధ్రకేసరికి జై’ అంటూ నినాదాలు చేశారు. 1921 సహాయనిరాకరణోద్యమంలో హైకోర్ట్ ‌లాయర్‌ ‌ప్రాక్టీసును వదిలిపెట్టారు. అప్పటికి ఆయన నెలకు 6వేల రూపాయలు సంపాదించే వారు. వివిధ నగరాల్లో పెద్దపెద్ద భవంతులు ఉండేవి. మూడు లక్షల రూపాయలు ఉండేవి. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న...
ArticlesNews

విభూతి ధారణ

నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకునేవి కొన్ని ఉంటాయి. వాటిలో ఐశ్వర్యం ఒకటి ధన ధాన్యాదులు మాత్రమే ఐశ్వర్యం కాదు. వ్యక్తుల మనుగడ, ఉన్నతి, అభివృద్ధి, ఆధ్యాత్మిక ఆలోచనలు తదితరాలకు దోహదం చేసేవన్నీ ఐశ్వర్యాలే ఐశ్వర్యాన్ని విభూతి అంటారు. ఇది రెండు రకాలు- భూతి, విభూతి అని ఈ లోకంలో అనుభవానికి వచ్చే సంపదలను 'భూతి' అని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగించే ఆలోచనలను 'విభూతి' అని అంటారు. ఈ రెండు రకాల ఐశ్వర్యాలనూ ప్రసాదించేది భస్మ రూపంలో ఉండే విభూతి ధారణ. విభూతి ధారణ అపమృత్యు భయాన్ని తొలగించి శుభాలు కలగజేస్తుందని, సకల సంపత్కరమైనదని ఒక శ్లోకంలో చెప్పారు పౌరాణికులు. వేదాలు, పురాణాలు విభూతి ధారణ మహిమను ముక్త కంఠంతో చాటుతున్నాయి. భస్మ ధారణ చేసినవారికి దుష్ట గ్రహాలు, పిశాచ పీడలు, రోగాలు, పాపాలు దరిచేరవు. ధర్మబుద్ధి, బాహ్య...
News

ఐఎన్‌ఎస్‌ జలశ్వను సందర్శించిన సీ క్యాడెట్‌ కార్ప్స్‌ క్యాడెట్లు

భారత నౌకాదళం కార్యకలాపాలు, సముద్ర వారసత్వం, లైఫ్‌ ఆన్‌బోర్డ్‌ షిప్‌లపై సమగ్ర అవగాహనే లక్ష్యంగా సుమారు 100 మంది సీ క్యాడెట్‌ కార్ప్స్‌ క్యాడెట్‌లు తూర్పు నావికాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ జలశ్వ ఓడను సందర్శించారు. సందర్శన సమయంలో సీ క్యాడెట్‌ కార్ప్స్‌...
1 1,211 1,212 1,213 1,214 1,215 2,480
Page 1213 of 2480