
భారత నౌకాదళం కార్యకలాపాలు, సముద్ర వారసత్వం, లైఫ్ ఆన్‌బోర్డ్ షిప్‌లపై సమగ్ర అవగాహనే లక్ష్యంగా సుమారు 100 మంది సీ క్యాడెట్ కార్ప్స్ క్యాడెట్‌లు తూర్పు నావికాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ జలశ్వ ఓడను సందర్శించారు. సందర్శన సమయంలో సీ క్యాడెట్ కార్ప్స్ క్యాడెట్లకు భారతనౌకాదళానికి చెందిన వివిధ డొమైన్‌లపై సమగ్ర వివరణను ఓడ సిబ్బంది అందించారు. దేశ ప్రయోజనాలను కాపాడటంలోనూ, సముద్ర భద్రతను పోత్రహించడంలోనూ, మానవతా సహాయం, విపత్తు సహాయక చర్యల్లో పాల్గొనడం వంటి నౌకాదళ సిబ్బంది పాత్రపై వివరించారు. అదే విధంగా క్యాడెట్‌లకు నావికుల దినచర్యలు, విధులు, బాధ్యతలతో పాటు పనిలో వారి సంస్కృతి, ఆన్‌బోర్డ్ షిప్‌లలో వారి జీవితం, నేవీలో సేవ చేయడానికి అవసరమైన త్యాగాలు, అంకితభావం గురించి అవగాహన కలిగించారు. యువతకు దేశభక్తిపై జాతీయ గర్వాన్ని అవలంబించే దిశగా సందర్శన ముగిసిందని నేవీ వర్గాలు తెలిపారు.





