ArticlesNews

జయ జయ నృసింహ సర్వేశా

266views

(మే 21 – నృసింహ జయంతి )
నృసింహావతారం ఇతర అవతారాల కంటే భిన్నమైనది. మహాభాగవతం పేర్కొన్న 21 అవతారాలలో ఇది 14వది కాగా, దశావతారాలలో నాలుగది. ‘వదునాలుగవదియైన నరసింహ రూపంబున కనక కశిపుని సంహరించె’ అన్నారు పోతనామాత్యులు. భగవంతుడు సర్వాంతర్యామి.ఇతర అవతారాల లక్ష్యం నెరవేరినంతనే శ్రీమహావిష్ణువు వైకుంఠానికితరలి వెళితే సర్వవ్యాపకుడైన నృసిహుండు భక్తపాలన కోసం ఇలలోనే ఉండిపోయాడు.

నృసింహావతారం సర్వశక్తి సమన్విత స్వరూపం. త్రిమూర్తుల సమన్వయశక్తితో దనుజ సంహారానికి అవిర్భవించిన పరబ్రహ్మ స్వరూపం. ‘ఇందుగల డందులేడని సందేహము వలదు/చక్రి సర్వోగతుందెం దుందు వెదకి చూచిన అందందే కలడు….‘ అన్న ప్రహ్లాదుడిని మాటలను నిజం చేస్తూ సర్వవ్యాపిత్వాన్ని చాటిన అవతారం.

‘నృసింహావతారం త్రిమూర్త్యాత్మకం. పాదాల నుంచి నాభివరకు బ్రహ్మ రూపం, నాభి నుంచి కంఠవరకు విష్ణురూపం, కంఠం నుంచి శిరస్సు వరకు రుద్రస్వరూపంగా ఆధ్యాత్మికులు అభివర్ణిం చారు. మరో కోణంలో, ద్వైయరూపాలు సాక్షాత్కరి స్తాయి.

దక్షిణభారతదేశంలో అనేక నృసింహ క్షేత్రాలు విశేష పూజలు అందుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఉత్తరాంధ్రలోని సింహచలం నుంచి రాయలసీమలోని కదిరి వరకు, తెలంగాణలోని యాదాద్రి తదితర క్షేత్రాలు నరసింహ దివ్య క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది,గుంటూరు జిల్లా మంగళగిరిలో పానకాల లక్ష్మీ నృసింహ స్వామి కొలువుదీరారు. కర్నూలు జిల్లా అహోబిలం. కదిరిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. కదిరి అడవి ప్రాంతానికి వచ్చి క్రూర జంతువులను వేటాడారని, అలా అయనకు ‘వేటరాయుడు’ అని పేరు వచ్చిందని చెబుతారు. వేటరాయుడే జనవ్యవవహారంలో బేట్రాయుడుగా మారిందని తెలుస్తోంది. తెలంగాణలోని యాదాద్రిలో లక్ష్మీనరసింహులుగా పూజలు అందుకుంటున్నారు