News

News

శాసనాల్లో అగస్త్య ముని ప్రస్థావన

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని ఐముక్తేశ్వరాలయంలో ఉన్న శాసనాల్లో అగస్త్య మహాముని ప్రస్థావన ఉన్నట్లుగా చరిత్రకారుడు మైనాస్వామి తెలిపారు. మంగళవారం ఆయన ఐముక్తేశ్వరాలయాన్ని సందర్శించి శాసనాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... పురాణ పురుషులు, రుషుల ఆగమనం గురించి తెలిపే శాసనాలు అరుదుగా ఉంటాయన్నారు. వేద కాలం నాటి అగస్త్యుని ప్రయాణం గురించి శాసనాల్లో ఉండడం చరిత్రకారులను అబ్బురపరిచే విషయమన్నారు. వింధ్య పర్వతాల్లో నివసించిన అగస్త్యుడు కాశీ క్షేత్రానికి వెళ్లడం, తిరిగి కాశీ నుంచి బ్రహ్మపురం (నేటి పెనుకొండ) వచ్చి ఘనగిరిపై గల బ్రహ్మ సరస్సు పక్కన తపమాచరించినట్లుగా శాసనాల్లో ఉందన్నారు. అలాగే మహాముని మలి అవతారంలో వామనేంద్రుని స్మృతిగా ఓ శివాలయాన్ని నిర్మించినట్లుగా ఉందన్నారు....
News

శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో వసంతోత్సవాలకు మంగ‌ళ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 22 నుండి 24వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చని టీటీడీ తెలిపింది. ఈ ఉత్స‌వాల్లో భాగంగా మూడు రోజుల పాటు మ‌ధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేప‌డ‌తారు. అలాగే రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మ‌వారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. మే 23వ తేదీ ఉదయం 7.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది....
ArticlesNews

భావితరాలకు ఎనలేని సాహిత్య సంపాదను అందించిన తరిగొండ వెంగమాంబ

తరిగొండ వెంగమాంబ తన రచనల ద్వారా భావితరాలకు ఎనలేని సాహిత్య సంపదను అందించిందని జేఈఓ శ్రీమతి గౌతమి ఉద్గాటించారు. శ్రీవారి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జ‌యంతి ఉత్సవాలు మంగ‌ళ‌వారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, తరిగొండ వెంగమాంబ శ్రీవారిపై భక్తి శ్రద్ధలతో అనేక సంకీర్తనలు రచించారన్నారు. వెంగమాంబ సాహిత్యాన్ని, రచనలు, కీర్తనలను జన బాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు టీటీడీ కృషి చేస్తోందన్నారు. ముత్యాల హారతి రూపంలో శ్రీ‌వారిలో ఐక్యమైనారన్నారు. అనంత‌రం జ‌రిగిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన అనంతపురం ఎస్‌కె వర్సిటీ మాజీ ఉపకులపతి డా.కుసుమకుమారి మాట్లాడుతూ, వెంగమాంబ ఎన్నో రచనలు చేసినా ఆమె రచనలకు గుర్తింపు రాలేదన్నారు. టీటీడీ త‌రిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఏర్పాటు చేసి ఆమె సాహిత్యాన్ని, ర‌చ‌న‌ల‌ను వెలుగులోకి తీసుకొని...
News

అప్పన్న ఆలయంలో నేడు నృసింహ జయంతి

వైశాఖ శుద్ధ చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో శ్రీనృసింహ జయంతి వైభవోపేతంగా జరగనుంది. ఆ మేరకు దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి నేతృత్వంలో అధికారులు, వైదిక పెద్దలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది చతుర్దశి...
News

విశాఖలో అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవం

గిరిజనుల సాంస్కృతిక హస్తకళా నైపుణ్యాన్ని ప్రపందానికి దాటిచెప్పేందుకు అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవాన్ని బుధవారం విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు విశాఖ జిల్లా అటవీశాఖ అధికారి అనంత్ శంకర్ పేర్కొన్నారు. గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులకు ఆర్థిక సాధికారత కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ, ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగే అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవంలో విశాఖ జిల్లా అటవీశాఖ అధికారి అనంత్ శంకర్ అమెజాన్ ఇండియాతో అవగాహన ఒప్పందాలపైన సంతకం చేయనున్నారు. విశాఖలోని శంభువానిపాలెంలో నివసించే గిరిజన వర్గాల వారసత్వ హస్తకళాకృతులకు అమెజాన్ యొక్క ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్ నుంచి మార్కెట్ సదుపాయం కల్పించనున్నామన్నారు. అలాగే, విస్తారమైన పరిధిని, వనరులను, గిరిజన హస్తకళలను ప్రదర్శించడం, విక్రయించడం ద్వారా గిరిజనులకు ఆర్ధిక తోడ్పాటునందిస్తామని అన్నారు....
News

ఆర్టికల్‌ 370 రద్దు తీర్పుపై సమీక్షకు సుప్రీం నో

జమ్మూ–కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించిన ఆర్టికల్‌ 370ను రద్దును సమర్థిస్తూ ఇచ్చిన తీర్పుపై సమీక్షించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆర్టికల్‌ 370 రద్దు సబబేనని గత ఏడాది డిసెంబరులో సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆధ్వర్యంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది....
News

ఊరంతా సుంకులమ్మ, ముత్యాలయ్యలే

ఏ పల్లెలోనైనా ఒకే పేరు ఉన్న వారు ఐదారు మంది ఉంటే గొప్ప. అలాంటిది ఆ ఊళ్లో దాదాపు వెయ్యి మందికి పైగా ఒకే పేరు పెట్టుకున్నారు. సుంకులమ్మ అనో..ముత్యాలయ్య అనో. తమ ఇలవేల్పును నిత్యం స్మరించేలా ఇలా గ్రామ దేవతల పేర్లు పెట్టామని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంతకు ఆ గ్రామం ఏదంటే...పామిడి మండలం రామరాజుపల్లి. గ్రామంలో 400 కుటుంబాలకు గాను 1,600 మంది జనాభా ఉన్నారు. వీరిలో ఓ వెయ్యి మందికి ముత్యాలయ్య, ముత్యాలరెడ్డి, ముత్యాలమ్మ పేర్లు ఉన్నాయి. అలాగే మరో 400 మందికి సుంకులమ్మ, సుంకిరెడ్డి, సుంకన్న తదితర పేర్లు ఉన్నాయి. అక్కాతమ్ముళ్లుగా జన్మించి... రామరాజుపల్లి గ్రామం ఏర్పడినప్పుడు రెడ్ల సామాజిక వర్గానికి చెందిన గణేశం వంశంలో సుంకులమ్మ, ముత్యాలయ్య అక్క, తమ్ముడిగా జన్మించారు. దైవాంశసంభూతులైన వారి మహిమతో గ్రామం సస్యశ్యామలంగా ఉంటూ...
News

అహ్మదాబాద్‌లో నలుగురు ఇస్లామిక్ ఉగ్రవాదుల అరెస్ట్

అహ్మదాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో నలుగురు ఇస్లామిక్‌ ఐసిస్‌ అనుమానిత ఉగ్రవాదులను గుజరాత్‌ యాంటీ టెరర్రిజం స్క్వాడ్‌ అరెస్టు చేసింది. వీరు శ్రీలంక వాసులని కూడా పేర్కొంది. అనుమానితులను ఏటిఎస్‌ పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న వీరి కదలికల పట్ల అనుమానం వచ్చి ప్రశ్నించగా… అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీలంక నుంచి చెన్నై మీదుగా అహ్మదాబాద్‌ చేరుకున్నట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పట్టుబడిన ఈ ఇస్లామిక్‌ ఐసిస్‌ ఉగ్రవాదులు పాక్‌తో నిరంతరంగా టచ్‌లో వున్నట్లు కూడా ఏటీఎస్‌ అనుమానాలు వ్యక్తం చేస్తోంది....
News

చార్‌ధామ్ యాత్ర: భక్తులకు అలెర్ట్.. మే 31 వరకు నిలుపుదల

హిందువులు ఎంతగానో ఎదురుచూసే చార్ ధామ్ కేదార్నాథ్ ఆలయ తలుపు తెరచుకోవడంతో ప్రారంభమైంది. ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ యాత్రకు దేశ నలుమూలల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఊహించిన దానికంటే యాత్రలో భారీ సంఖ్యలో భక్తులు...
News

విద్య అంటే ర్యాంకులు, మార్కులు కాదు.. విజ్ఞాన సముపార్జన

భావితరాల భవిష్యత్ విద్యపైనే ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. మానవాళి సమస్యలన్నింటికి విద్య ద్వారానే పరిష్కారం...
1 1,209 1,210 1,211 1,212 1,213 2,480
Page 1211 of 2480