News

ఆకాశంలో రాకాసి ఉల్క

212views

స్పెయిన్, పోర్చుగల్‌ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ భారీ ఉల్క భూమిపై పడింది. భూవాతావరణాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చే క్రమంలో అది రాపిడికి లోనై నీలివర్ణపు వెలుగులను వెదజల్లింది. ఫలితంగా రాత్రి సమయం.. పట్టపగలును తలపించింది. ఇది ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఈ ఉల్క వెలుగు కొన్ని వందల కిలోమీటర్ల దూరం కనిపించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఉల్క ఎక్కడ నేలను తాకిందో ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఇది క్యాస్ట్రోడైరో ప్రాంతంలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.