News

నాగరికతా విలువలు, భిన్నత్వంలో ఏకత్వం, సామాజిక సమరసతతో కూడిన దృక్పథం ఆర్ఎస్ఎస్

6views

లండన్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ప్రస్తుతం అమెరికా, కెనడా యునైటెడ్ కింగ్‌డమ్ దేశాలలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా లండన్‌లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఒక విలేకరుల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ప్రసంగించారు. డాక్టర్ మోహన్ భగవత్ UK పర్యటన, RSS శతాబ్ది ఉత్సవాల కోసం చేపట్టిన ప్రపంచవ్యాప్త ప్రచార కార్యక్రమం మరియు రాబోయే కార్యక్రమాల వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు.

ఈ సందర్బంగా సందర్భంగా సునీల్ అంబేకర్ మాట్లాడుతూ మోహన్ భాగవత్ చేపట్టిన యూకే పర్యటన, నాగరికత, సంస్కృతికి సంబంధించిన చర్చను మరింత లోతుగా తెలియచేయడానికి, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు సంఘ కార్య శతాబ్దినికి సంబంధించిన అనుభవాన్ని ప్రపంచంతో పంచుకోవడం లాంటి విషయాలే లక్ష్యంగా సాగుతుందని తెలిపారు.

ఈ పర్యటన సందర్బంగా సర్ సంఘచాలక్ కి స్వాగతం పలికేందుకు, కార్యక్రమంలో పాల్గొనేందుకు అనేక సామాజిక, ప్రజా సంఘాలు ఉత్సాహంతో వున్నాయన్నారు. ఈ నెల 7 వరకూ ఈ పర్యటన కొనసాగుతుందన్నారు. యూకే పర్యటన పూర్తి చేసుకొని, తిరిగి ఢిల్లీకి పయనమవుతారన్నారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ పర్యటన జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. “ఇది ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపట్టిన పర్యటన,” అని ఆయన అన్నారు.శతాబ్ది ఉత్సవాల ప్రాముఖ్యతను వివరిస్తూ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనేది భారత్ కేంద్రంగా పనిచేస్తున్న అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అని, దీనిని 1925లో డాక్టర్ హెడ్గేవార్ స్థాపించారని అంబేకర్ తెలిపారు. సంఘ్ గత ఏడాదితోనే 100 ఏళ్లు పూర్తి చేసుకుందని, 2025–26 సంవత్సరాలను దాని శతాబ్ది సంవత్సరంగా జరుపుకుంటున్నామని ఆయన చెప్పారు.

సంఘ్ కార్య శతాబ్ది సందర్భంగా భారత్ లో విస్తృత స్థాయిలో ప్రజలను సంప్రదించే కార్యక్రమాలు జరిగాయన్నారు. సంఘ్ సమాజంలోని వివిధ వర్గాలు, ప్రాంతాలు, వృత్తులకు చెందిన ప్రజలను చేరుకుందని, అలాగే సమాజం, వివిధ వర్గాల మధ్య విస్తృత స్థాయిలో సంవాదం కూడా జరిగిందన్నారు. గత వంద ఏళ్లుగా, ముఖ్యంగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్‌లో చోటుచేసుకున్న పరిణామాలు మరియు సానుకూల మార్పులను తెలియజేయడానికి, శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రపంచవ్యాప్త ప్రచారాన్ని చేపట్టాలని సంఘ్ నిర్ణయించిందని ఆయన చెప్పారు.

ఆర్ఎస్ఎస్ లక్ష్యం, ఆశయం, దాని కార్యకలాపాలు, వంద సంవత్సరాల ప్రస్థానం, దాని అనుభవాల నుంచి మానవాళికి, ప్రపంచానికి దొరికిన సందేశాన్ని తెలియజేయడమే విస్తృత సంప్రదింపుల కార్యక్రమ ఉద్దేశమని అంబేకర్ వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచంతో నేరుగా సంభాషిస్తున్నామని, కార్య శతాబ్ది సందర్భంగా విస్తృతమైన ప్రపంచ శాంతి, సంవాదం కోసం ప్రముఖులు, సంఘాలు, సంస్థలను సంప్రదించేందుకు సంఘ్ ప్రయత్నిస్తోందన్నారు.

సంస్కృతి, నాగరికతపై ఆధారపడిన అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఆర్ఎస్ఎస్ ప్రపంచ స్థాయిలో కచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్‌ఎస్‌ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే ప్రపంచ వ్యాప్త పర్యటన కూడా చేశారని, ఇందులో భాగంగా అమెరికా, జర్మనీ, యూకేలో పర్యటించి, వివిధ రకాలైన మేథోపరమైన వ్యక్తులను, రాజకీయ, వ్యాపార, విద్యా రంగాలకు చెందిన వారిని కలిశారన్నారు. ఆ పర్యటనకు చాలా మంచి స్పందన లభించిందని, అదే నాగరికతాపరమైన సంభాషణను కొనసాగించేందుకు ప్రస్తుత పర్యటనను చేపట్టామని ఆయన చెప్పారు.

ప్రభుత్వ స్థాయిలో జరిగే దౌత్యపరమైన చర్చలతో పాటు, ప్రజల మధ్య సంభాషణలు మరియు నాగరికత, సాంస్కృతిక సంబంధాలు కూడా అవసరమని సంఘ్ భావిస్తోందని సునీల్ అంబేకర్ పేర్కొన్నారు. సంస్కృతి మరియు నాగరికత మూలాలుగా కలిగిన అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా, ప్రపంచ స్థాయిలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

ఇక.. ఈ విలేకరుల సమావేశం సందర్భంగా అంబేకర్ ఆర్ఎస్ఎస్, దాని విస్తరణ, సంస్థాగత విస్తరణ గురించి తెలియజేశారు. ఈ సంస్థ భారత్ లో గట్టి పునాదులతో వుందని, ప్రాథమికంగా శాఖ నిర్వహిస్తుందని, దీని ద్వారా విస్తరించిందన్నారు. “మేము ‘శాఖ’ అని పిలిచే స్థానిక దైనందిన సమావేశాలు 88,000కు పైగా జరుగుతున్నాయి,” అని తెలిపారు. అలాగే సాంఘీక్, నెలవారీ సమావేశాలు కడూా జరుగుతున్నాయని, దీని ద్వారా మొత్తం సమావేశాల సంఖ్య 1,34,00 కి చేరుకుందన్నారు.శాఖలు ప్రధానంగా వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తాయని, తద్వారా సమాజాన్ని సంఘటితం చేస్తాయని ఆయన వివరించారు.

మంచి వ్యక్తిత్వం, దేశభక్తి మరియు ప్రజాసేవ పట్ల అంకితభావం కలిగిన వ్యక్తుల మధ్య ఉన్న అనుసంధానం కారణంగానే, ఆర్థిక లేదా సామాజిక సహాయం అవసరమైన వారితో సహా ఆపదలో ఉన్నవారి కోసం అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం స్వయంసేవకులకు సాధ్యమైందన్నారు.విద్య, స్వయం ఉపాధి, సాధికారత, ఉపాధి, ఆరోగ్యం మరియు మహిళా సాధికారత వంటి రంగాలలో వివిధ రకాల సేవా కార్యక్రమాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఏదైనా కొత్త అవసరం ఏర్పడినప్పుడల్లా, సంఘం కొత్త రకాల కార్యక్రమాలను ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు.

నాగరికతా విలువలు, భిన్నత్వంలో ఏకత్వం, సామాజిక సమరసతతో కూడిన దృక్పథం ఆర్ఎస్ఎస్ కి వుందన్నారు. విభజనవాదం, తీవ్రవాదం మరియు అన్ని రకాల హింసను తిరస్కరిస్తూనే, సమాజాన్ని సంఘటితం చేయడం మరియు సామాజిక ఐక్యతను పెంపొందించడం సంఘ్ కార్యకలాపాల లక్ష్యమని ఆయన చెప్పారు.

సంఘ కార్య శతాబ్ది సందర్భంగా పంచ పరివర్తన్ ను సమాజానికి పరిచయం చేశామని, దీనిని సమాజంలో అమలు చేయాలని కూడా పిలుపునిచ్చామన్నారు. శతాబ్ది సంవత్సరంలో సంఘం తన సందేశంతో 100 కోట్లకు పైగా కుటుంబాలను చేరుకుందని అంబేకర్ తెలిపారు.న్యూయార్క్ నుండి టొరంటో వరకు వివిధ వర్గాలతో నాగరికతాపరమైన సంవాదంలో పాల్గొన్నారని, ప్రస్తుతం ఆయన లండన్‌లో ఉన్నారని తెలిపారు.ఆగస్టు 29న, వివిధ మతాలు మరియు శాఖలకు చెందిన 175 మంది ప్రతినిధులు హాజరైన ‘వివిధ మత నాయకుల సమావేశం’లో డాక్టర్ మోహన్ భాగవత్ ప్రసంగించారని ఆయన పేర్కొన్నారు.