News

ఆరెస్సెస్‌ అఖిల భారతీయ ప్రతినిధి సభ వాయిదా

548views

రోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ నెలలో జరగాల్సిన ‘అఖిల భారతీయ ప్రతినిధి సభ'(ఏబీపీఎస్‌) వార్షిక సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆరెస్సెస్‌ ప్రకటించింది. ముందుగా నిర్ణయించినట్లు బెంగళూరులో ఈ నెల 15 నుంచి 17 మధ్య ఈ సమావేశాలు జరగాల్సి ఉంది. ఆరెస్సెస్‌లో అత్యున్నత నిర్ణాయక విభాగం అయిన ఏబీపీఎస్‌ ఏటా ఒకసారి సమావేశమవుతూ ఉంటుంది. వైరస్‌ దేశంలో క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాల మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరెస్సెస్‌ ప్రధాన కార్యదర్శి సురేశ్‌ భయ్యాజీ జోషి తెలిపారు. వైరస్‌ ముప్పును సమర్థంగా ఎదుర్కొనేలా స్థానిక యంత్రాంగంతో కలిసి ప్రజల్లో అవగాహన కల్పించాలని అయన స్వయంసేవకులను కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.