NewsProgramms

ఉగాది నుంచి రాష్ట్రమంతటా శ్రీ రామ దీక్షలు

144views

ర్మ జాగరణ సమితి మరియు మహా విద్యా పీఠంల సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 25 ఉగాది నుంచి ఏప్రిల్ 2 శ్రీ రామ నవమి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు శ్రీరామ దీక్ష కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా మహా విద్యా పీఠం వ్యవస్థాపకులు శ్రీ చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ ఇప్పటికే శ్రీరామ దీక్ష చేపట్టడానికి దాదాపు లక్షమంది సిద్ధంగా ఉన్నారన్నారు.

దీక్షకు సంబంధించిన శ్రీ రామ రక్షా స్తోత్రం కరపత్రాలు, జపమాలలు, బ్యానర్లు, జెండాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకు పంపిణీ చేస్తున్నామన్నారు. తొలి ఏడాదే లక్షకుపైగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. దీక్ష లో భాగంగా ఏప్రిల్ 4న శ్రీరామ జన్మస్థానమైన అయోధ్యలో శ్రీ సీతారామ కళ్యాణాన్ని మహా విద్యా పీఠం, ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరామ దీక్షా యజ్ఞం కరపత్రాలను విజయవాడలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆర్ ఎస్ ఎస్ సహ ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ వాసుదేవ రావు మాట్లాడుతూ నేడు హిందూ సమాజంలో ధార్మిక చైతన్యం కొరవడిందని, హిందువులలో ధార్మిక చైతన్యాన్ని నింపడానికి ధర్మ జాగరణ సమితి, మహా విద్యా పీఠం లు రెండూ కలసి పనిచేస్తూ ఉండటం స్వాగతించదగిన పరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మ జాగరణ రాష్ట్ర సహ పరియోజన ప్రముఖ్ శ్రీ ముత్యాలరావు మాట్లాడుతూ మహా విద్యా పీఠం వారికి, శ్రీ సుబ్రహ్మణ్య శర్మ గారికి, ఈ ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారాన్ని అందించిన హిందూ బంధువులందరికీ ధర్మ జాగరణ సమితి తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.