News

జగ్గయ్యపేటలో గోమాంసం తరలింపును అడ్డుకున్న హిందూవులపైదాడి

6views

 

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో గోమాంసం తరలింపు  నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని హిందూ చైతన్య వేదిక, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆరోపించారు. ఈ ఘటనలో తమ కార్యకర్తలపై దాడి జరిగిందని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని వారు పేర్కొన్నారు.

హిందూ సంఘాల ప్రతినిధుల కథనం ప్రకారం, జూన్ 30న ఇద్దరు ముస్లిం యువకులు మాంసాన్ని బస్తాల్లో తరలిస్తుండగా కార్యకర్తలు వారిని ప్రశ్నించారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, మాంసాన్ని పరీక్షల కోసం వెటర్నరీ ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు.

అయితే, వెటర్నరీ ఆసుపత్రి వద్దకు చేరుకునే సమయానికి పెద్ద సంఖ్యలో ముస్లిం వ్యక్తులు గుమిగూడి తమ కార్యకర్తలపై దాడి చేశారని హిందూ సంఘాలు ఆరోపించాయి. ఈ ఘటనలో చల్ల గణేష్ అనే కార్యకర్తకు తీవ్ర గాయాలు అయినట్లు పేర్కొన్నాయి. రాళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు.

 

 

ఈ ఘటన అనంతరం పోలీస్ స్టేషన్‌లో జరిగిన పరిణామాలపై కూడా హిందూ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. తమ ఫిర్యాదును సరిగా స్వీకరించలేదని, బాధితుల వాంగ్మూలాలను నమోదు చేయలేదని, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాలన్న విజ్ఞప్తిని కూడా పట్టించుకోలేదని ఆరోపించాయి. అంతేకాకుండా తమ కార్యకర్తలపైనే బైండోవర్ కేసులు నమోదు చేశారని పేర్కొన్నాయి.

తదుపరి నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో కూడా తమ అభ్యంతరాలను అధికారులు పట్టించుకోలేదని హిందూ సంఘాల నాయకులు తెలిపారు.

ఇటీవలి కాలంలో జగ్గయ్యపేటలో కొత్తగా వచ్చిన వ్యక్తుల సంచారం పెరిగిందని, కొన్ని ప్రాంతాల్లో గుంపులుగా తిరుగుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు హిందూ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపి, ప్రజల్లో భద్రతా భావన కల్పించాలని వారు ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను కోరారు.