
89views
విశాఖ జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో ఈనెల 20న జరగనున్న చందనోత్సవం సందర్భంగా నిజరూప దర్శనం అనంతరం స్వామికి సమర్పించేందుకు శ్రీగంధం సేకరణ కార్యక్రమానికి ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు. శుక్రవారం అర్చకులు స్వామి సన్నిధిలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు తొలి గంధాన్ని అరగదీసి చందనం అరగదీసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు దంపతులు చందనం అరగదీసే సిబ్బందికి నూతన వస్త్రాలు, చందనం చెక్కలు అందజేశారు. ఆలయంలో నాలుగు రోజులపాటు జరిగే ఈ ప్రక్రియలో భాగంగా మూడు మణుగుల గంధాన్ని సేకరిస్తారు. ఇందులో సుగంధ ద్రవ్యాలు ఫలితం చేసి చందనోత్సవం నాడు నిజరూప దర్శనం, సహస్ర ఘటాభిషేకం అనంతరం స్వామికి తొలి విడతగా సమర్పిస్తారు.





