ArticlesNews

పవిత్రం.. కుంభ సంక్రమణం

123views

( ఫిబ్రవరి 13 – కుంభ సంక్రమణం )

సూర్యుడు మకరరాశి నుంచి కుంభరాశిలో ప్రవేశించే రోజును కుంభ సంక్రమణం అంటారు. హిందూ సౌరమానం ప్రకారం.. ఇది పదకొండో నెల ప్రారంభం. దేశవ్యాప్తంగా అనేకమంది కుంభ సంక్రాంతి ఎంతో వైభవంగా చేసుకుంటారు. భక్తులు పుణ్య నదుల్లో పవిత్ర స్నానాలు చేస్తారు. తమ జీవితాల్లో భయాలు, బాధలు తొలగి శుభం చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. ముఖ్యంగా నదీ తీరాల్లో ఉన్న ఆలయాలు ఈ ప్రత్యేక దినాన భక్తులతో నిండిపోతాయి. కుంభ సంక్రాంతి రోజున స్వయంపాకం దానం ఇవ్వడం శ్రేష్ఠమన్నది శాస్త్ర వచనం. నదీమతల్లికి నమస్కరించి తెలిసీ తెలియక చేసిన పాపాలు నశించాలని కోరుకొని స్నానాలు ఆచరిస్తారు.

ఈ రోజున ఆవుకు గ్రాసం సమర్పిస్తే దోషాలు తొలగి, శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఈ రోజున వైష్ణవాలయాలను దర్శించుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సత్ఫలితాలుంటాయని పండితులు చెబుతారు. అలాగే ఇష్టదేవతలతో పాటు పార్వతీదేవిని, బృహస్పతిని పూజిస్తారు.