
అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభం కానున్నాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు స్వామి గోవింద్ దేవ్‌గిరి మహ్‌రాజ్ వెల్లడించారు. తుది తేదీని ట్రస్ట్ తొలి సమావేశంలో నిర్ణయిస్తామని తెలిపారు. రామ మందిర నిర్మాణానికి 15 మంది సభ్యులతో కూడిన స్వతంత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మోదీ ప్రభుత్వం బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ట్రస్టులో సభ్యుడైన దేవ్‌గిరి మహరాజ్ ఇక్కడ మీడియాతో మాట్లాడారు.

‘ కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్‌ను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నా. రామ మందిర నిర్మాణాన్ని శ్రీరామ నవమి (ఏప్రిల్ 2) రోజు గానీ, అక్షయ్ తృతీయ (ఏప్రిల్ 26న) రోజు గానీ ప్రారంభించే అవకాశం ఉంది. ప్రయాగ్‌రాజ్‌లో జరిగే ట్రస్ట్ తొలి సమావేశంలో తేదీని నిర్ణయిస్తాం. రాబోయే రెండేళ్లలో ఆలయ నిర్మణాన్ని పూర్తి చేస్తాం ” అని దేవ్‌గిరి మహ్‌రాజ్ తెలిపారు.





