News

మొన్న పిఠాపురం నేడు రొంపిచర్ల – ఎన్నాళ్ళీ ధ్వంస రచన?

2.3kviews

మధ్య కొందరు దుండగులు పశ్చిమ గోదావరి జిల్లా పిఠాపురంలో వివిధ దేవాలయాలలోని దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన సంఘటన మరువక ముందే  గుంటూరు జిల్లాలోని మండల కేంద్రమైన రొంపిచర్లలో రుక్మిణీ సత్యభామ సమేత మదన గోపాల స్వామి వారి ఆలయంలోని విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు పవిత్రమైన దేవతా విగ్రహాల పట్ల దుండగులు చేసిన అపచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం ఏర్పడిన తరువాత హిందూ దేవాలయాలు, సంస్కృతిపై దాడులు పెరిగాయని, ప్రభుత్వం వీటిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజాగ్రహానికి గురికావలసి వస్తుందని కొందరు వ్యాఖ్యానించారు. ఆలయ కమిటీ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఘటనపై పోలీసులు విచారణ మొదలు పెట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.