News

శబరిమల ఆలయ ప్రవేశంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

672views

బరిమల అయ్యప్ప ఆలయం తోపాటు ఇతర ప్రార్థనా మందిరాల్లోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడింది. విచారణ అంశాలను తామే ఖరారు చేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు.

విచారణ చేపట్టాల్సిన అంశాలు, ప్రశ్నలు తామే రూపొందిస్తామని చెప్పారు. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేశారు. ఈ అంశంపై వాదనలు వినిపించేందుకు న్యాయవాదులకు సమయం చెబుతామని ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం తెలిపింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.