News

కేరళలో హిందువుల ఇళ్ళపై దాడి చేసి, వాహనాలను తగులబెట్టిన ఉన్మాద వామపక్ష-జిహాదీ గుంపు

1.2kviews

కేరళలో సిఎఎ వ్యతిరేక నిరసనలు మతతత్వంగా మారుతున్నాయి. కేరళలో కమ్యూనిస్టు-ఇస్లామిస్ట్ లు CAA ఆందోళనల పేరిట నిరంతరం ఆర్ఎస్ఎస్-బిజెపి కార్యకర్తలను మరియు వారి కుటుంబాలను లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. తాజాగా జరిగిన మరో సంఘటనలో, కొడుంగల్లూరులో ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి కార్యకర్తల ఇళ్లు, వాహనాలపై కొందరు అనుమానిత సిపిఎం-పిఎఫ్‌ఐ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు.

ఈ దాడిలో అనేక ఇళ్ళు ధ్వంసమయ్యాయి మరియు వాహనాలు తగులబడ్డాయి. బస్ షెల్టర్లు, స్పోర్ట్స్ క్లబ్‌లు, హిందూ సంస్థల జెండా స్తంభాలతో సహా వివిధ ఆస్తులపై దాడి చేశారు. నిన్న సాయంత్రం కొడుంగల్లూరు సమీపంలోని అరేకల్ బీచ్‌లో పిఎఫ్‌ఐ, ఇతర రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థలు ఏర్పాటు చేసిన సిఎఎ వ్యతిరేక సమావేశంలో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడిన తరువాత రాత్రి ఈ దాడి జరిగింది. సమావేశం తరువాత అదే రాత్రి కోడంగల్లూరు మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్మాద ఇస్లామిస్ట్ గుంపు అల్లర్లు చేసినట్లు సమాచారం.

నిప్పంటించిన వాహనాల్లో రెండు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్లు, మారుతి రిట్జ్ కారు, యమహా స్కూటర్ మరియు చేవ్రొలెట్ తవేరా కారు ఉన్నాయి. దుండగులు ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ మరియు బస్ షెల్టర్ ని కూడా తగులబెట్టారు.

ఈ సంఘటనలకు సంబంధించి స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. నివేదికల ప్రకారం, చంద్రశేఖర్ ఆజాద్ హాజరైన పిఎఫ్ఐ కార్యక్రమానికి పెద్దగా జనం హాజరవలేదు. దీంతో ఇది ఇస్లామిక్ మూకలకు ఆగ్రహం తెప్పించింది. కొడుంగల్లూరు తీరప్రాంతంలో కమ్యూనిస్టుల మద్దతు ఉన్న జిహాదీ శక్తులు చాలా కాలంగా మత ఘర్షణలను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నాయని స్థానికులు వివరిస్తున్నారు.

జిహాదీ దాడిలో బిజెపి కార్యకర్త ఉన్నికృష్ణన్ ఇల్లు, మోటారుసైకిల్‌పై దాడి చేసి నిప్పంటించారు. మరో బిజెపి కార్యకర్త, పంచాయతీ సభ్యుడు సురేష్ వాహనంపై కూడా దాడి జరిగింది. కోడంగల్లూరులోని మరో బిజెపి కార్యకర్త అనిల్ కుమార్ కారును కూడా ఉన్మాద గుంపు తగులబెట్టింది. సిఎఎకు మద్దతుగా బహిరంగ కార్యక్రమంలో మాట్లాడటానికి కొడుంగల్లూరు వచ్చినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత కార్యాకారిణి సభ్యుడు శ్రీ వల్సన్ తిల్లంగేరి ఒక రోజు బస చేసిన ఇంటిపై కూడా దుండగులు దాడి చేశారు. ఇక్కడి వాహనాలకు కూడా నిప్పంటించారు. కొడుంగల్లూరులో సిటిజెన్ ఫోరం నిర్వహించిన సిఎఎ అనుకూల కార్యక్రమాలలో పాల్గొన్న వారి ఇళ్ళు, వాహనాలను దుండగులు ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారు.

കൊടുങ്ങല്ലൂർ മേഖലയിൽ പൗരത്വ നിയമ ഭേദഗതിയെ അനുകൂലിച്ചവരുടെ വീടുകൾക്ക് നേരെ അക്രമം.

കൊടുങ്ങല്ലൂർ മേഖലയിൽ പൗരത്വ നിയമ ഭേദഗതിയെ അനുകൂലിച്ചവരുടെ വീടുകൾക്ക് നേരെ ഇടത്-ജിഹാദി ഭീകരരുടെ അക്രമം. ഇന്നലെ രാത്രിയിലാണ് സംഭവം. കൊടുങ്ങലൂർ സിറ്റിസൺ ഫോറത്തിന്റെ ആഭിമുഖ്യത്തിൽ ഇന്നലെ നിയമത്തിനെതിരെ കൊടുങ്ങല്ലൂരിൽ പരിപാടി നടത്തിയിരുന്നു. ഇതിന് ശേഷം രാത്രിയിലാണ് അക്രമങ്ങൾ അരങ്ങേറിയത്.നിരവധി വീടുകളും വാഹനങ്ങളും ബസ് സ്റ്റോപ്പുകളുമാണ് ആക്രമിക്കപ്പെട്ടു. ബിജെപി പ്രവർത്തകനായ ഉണ്ണികൃഷ്ണന്റെ വീടും ആക്രമണത്തിനിരയായി. ഉണ്ണികൃഷ്ണന്റെ മോട്ടോർ സൈക്കിൾ തീവെച്ച് നശിപ്പിച്ചു. ഇടവിലങ്ങിലെ ബിജെപി പഞ്ചായത്ത് മെംബർ സുരേഷിന്റെ മോട്ടോർ സൈക്കിളും ബിജെപി പ്രവർത്തകൻ അനിൽകുമാറിന്റെ കാറും അഗ്നിക്കിരയാക്കി. കൂടാതെ ബസ് സ്റ്റോപ്പും കൊടിമരവും ഉൾപ്പെടെ ഇരുളിന്റെ മറവിൽ നശിപ്പിക്കപ്പെട്ടിട്ടുണ്ട്. തീരദേശ മേഖലയിൽ കലാപം ലക്ഷ്യമിട്ടാണ് ഇടത്- ജിഹാദി ഭീകരർ തുടർച്ചയായി പ്രകോപനം സൃഷ്ടിക്കുകയാണ്. പൗരത്വ ബില്ലിനെതിരായ പ്രതിഷേധം ഫലം കാണാത്തതും പ്രതിഷേധത്തിന് പ്രതീക്ഷിച്ച ജനപങ്കാളിത്തം ഇല്ലാതിരുന്നതുമാണ് പെട്ടന്നുള്ള പ്രകോപനത്തിന് കാരണം.

Posted by BJP Keralam on Monday, February 3, 2020

అనూహ్యంగా, కేరళ ముఖ్యమంత్రి, సిపిఎం నాయకుడు పినరయ్ విజయన్ కూడా రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థ పిఎఫ్‌ఐ యొక్క రాజకీయ విభాగమైన ఎస్‌డిపిఐ సిఎఎ వ్యతిరేక నిరసనల పేరుతో, ప్రజలలో విభేదాలను సృష్టిస్తోందని పేర్కొనడం గమనార్హం. పిఎఫ్‌ఐ రాష్ట్రంలో ‘కొన్ని అవాంఛనీయ సంఘటనలకు’ కారణమైందని కేరళ సిఎం కూడా అంగీకరించారు. “ఎస్డీపీఐ వంటి ఉగ్రవాద గ్రూపులు ఇలాంటి విషయాలలో [సిఎఎ] జోక్యం చేసుకోవడం ద్వారా ప్రధాన సమస్య నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఫలితంగా, కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ప్రజలను విభజించే ప్రయత్నాలు జరిగాయి” అని ఆయన అన్నారు. ఏదేమైనా, సిపిఎం CAA వ్యతిరేక నిరసనలలో తీవ్రవాద ఇస్లామిస్ట్ శక్తులతో కలసి పని చేస్తూనే ఉంది. అంతే కాక రాష్ట్రంలోని ముస్లిం జనాభాను ప్రేరేపించడానికి CAA వ్యతిరేక అల్లర్లను ఉపయోగించుకుంటోంది. సిఎఎకు నిరసనగా సిపిఎం నిర్వహించిన మానవ హారం కార్యక్రమంలో పిఎఫ్ఐ ఉగ్రవాదులు చురుకుగా పాల్గొన్నారు.

Source : Organiser.

https://www.organiser.org/Encyc/2020/2/3/Frenzied-Red-Jihadi-mob-attack-Hindu-houses-in-Kerala.html

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.