News

జాతీయ హస్తకళా పురస్కారాలు అందుకున్న రాష్ట్ర కళాకారులు

192views

హస్తకళల్లో విశేష ప్రతిభ చూపుతున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు కళాకారులను కేంద్ర జౌళి శాఖ జాతీయ అవార్డులతో సత్కరించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కళాకారులకు అవార్డులు ప్రదానం చేసి, అభినందించారు.

అవార్డులు అందుకున్న వారిలో శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారిణి డి. శివమ్మ, అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాకకు చెందిన ఏటికొప్పాక బొమ్మల తయారీ కళాకారుడు గోర్సా సంతోష్, తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం కుప్పం గ్రామానికి చెందిన కళంకారి కళాకారిణి పి.విజయలక్ష్మి ఉన్నారు. డి.శివమ్మ, పి. విజయలక్ష్మిలు 2023 సంవత్సరానికి ‘శిల్పగురు అవార్డు’, ‘నేషనల్ హాండీక్రాఫ్ట్ అవార్డు’ సొంతం చేసుకోగా, సంతోష్ 2024 సంవత్సరానికి జాతీయ అవార్డు అందుకున్నారు. అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పాల్గొన్నారు.

  • ఈ కార్యక్రమంలో 12 శిల్పగురు, 36 జాతీయ, 2 డిజైన్ అండ్ ఇన్నోవేషన్ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు.