
ఈ మధ్య తమిళనాడులో హిందువల పుణ్యక్షేత్రాలకు, పండుగలకు అధికార పార్టీ నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హిందువులను తమ పండుగలను తాము చేసుకోనివ్వకుండా అడ్డుపడుతోంది. తిరుప్పరంకుండ్ర వివాదం సంగతి అందరికీ తెలిసిందే..పవిత్రమైన ఆరు సుబ్రహ్మణ్యక్షేత్రాలలో ఒకటిగా ఉన్న ఆ కొండని ముస్లింలు ఆక్రమించుకుని మన ఆలయ గోడలను ఆధారంగా చేసుకుని మసీదునునిర్మించుకుని వారి భూమిగా ప్రకటించుకున్నారు. ఈవిషయమై గత కొద్ది రోజులుగా అక్కడ హిందువులు న్యాయపోరాటం చేస్తున్నారు.అందుకోసం మురుగన్ భక్తులంతా కలిసి పెద్ద సమావేశాన్ని కూడా నిర్వహించారు. అయితే తాజాగా మళ్లీ ఈ ప్రాంతం వార్తల్లోకెక్కింది.
తమిళనాడులోని తిరుపరన్కుండ్రం కొండ, భగవాన్ మురుగన్ (కుమారస్వామి) కు చెందిన ఆరు పవిత్ర పుణ్య క్షేత్రములలో ఒకటి. అరుణాచలంమాదిరిగానే కార్తీకదీపోత్సవాన్ని ఈ క్షేత్రంలోనూ నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో వున్న రాతి దీప స్తంభం పైన కార్తీక దీపం వెలిగించే సంప్రదాయం చాలాకాలంగా కొనసాగుతోంది, అంతేకాదు ఈ మహాదీపానికి ప్రత్యేకత ఉన్నది. భారీ రాగి దీపంతలో 160 కిలోల నెయ్యి, 5 కిలోల కర్పూరం వేసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపానికి వినయోగించే ఒత్తిని సుమారుగా 100 మీటర్ల వస్త్రంతో తయారు చేస్తారు. ఆ ఒత్తిని నెయ్యిలో ముంచి వెలిగిస్తారు. పరిసరాల్లో వెలుగులు విరజిమ్ముతూ రాత్రంతా ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది.
తిరుప్పరంకుండ్రంలో ఉన్న సికిందర్ దర్గాక 300 అడుగుల దూరంలోని రాతిస్తంబం పేరు విళుక్కు తూన్..అదే ఇప్పుడు వివాదంగా మారింది, ఈ ఆలయంలోని రాతిస్తంభంపై దీపం వెలిగించడానికి హిందూ సంస్థల నిర్వాహకులు పట్టుబట్టారు. ఇది దర్గా ప్రాంతానికి సమీపంలో ఉండడంతో సున్నత సమస్యగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఇది రాతి స్థంబం కాదని, ఇలాంటి రాళ్లు మరో ఆరున్నాయని కొందరు వాదిస్తున్నారు. దీనిని హిందూ మున్నాని నిర్వాహుకులు ఖండిస్తున్నారు. ఎక్కడైనా సర్వే రాళ్లు ఏడు అడుగుల పొడవు ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు.
ఇక 2005లో జరిగిన శాంతి కమిటీ సమావేశంలో దర్గాకు 15 మీటర్ల దూరంల దీపం వెలిగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని దర్గా తరుపున వెళ్లడించారు. దీప స్థంబం వద్ద హనుమంతుడి చిత్రం తో కూడిన శిల్పం ఉండడంతో సమీపాన ఉన్న ముస్లిం జండా స్తంబాన్ని తీసేయాలంటూ 2021లో జిల్లా కలెక్టర్ కు హిందు మున్నాని పిటిషన్ సమర్పించింది. ముధరై ధర్మాసనం 2021 అక్టోబర 10న ఇచ్చిన తీర్పులో తిరుప్పరం కుండ్రం కొండ పై భాగంలో సికందర్ దర్గా వద్ద జంతుబలులను నిషేధించింది. దీన్ని తిరుప్పరంకుండ్రంగానే పిలవాలని ఆదేశించింది. అయితే తాజాగా రాతిస్తంభంపైనే దీపాన్ని వెలిగించాలని మధురై హైకోర్టు అనుమతి ఇచ్చినా, అమలు చేయకోవడంతో వివాదం నెలకొంది. కోర్టు స్పష్టమైన ఆదేశం ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం ఆలయ అధికారులు దీపాన్ని పురాతన రాతి దీపస్థంభం వద్ద కాకుండా మరొకచోట వెలిగించడంతో పరిస్థితి గొడవగా మారింది.
దీని కారణంగా హిందూ కార్యకర్తలు, వందలాది భక్తులు నిరసనకు దిగారు. పోలీసులు ఆందోళనలను అడ్డుకోవడానికి ప్రయత్నించగా తోపులాటలు జరిగాయి, ఒక పోలీసు గాయపడటంతో పరిస్థితి ఉద్రిక్తమైంది.సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గ్రి స్వామినాథన్, ‘సాయంత్రం 6 గంటలలోపు దీపం వెలగాలని, లేకపోతే 6:05 గంటలకు ధిక్కరణ చర్యలు ప్రారంభిస్తామని‘ స్పష్టమైన హెచ్చరిక చేసినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం కోర్టు ఆదేశాలను అమలు చేయలేదు.
ఎందుకు చేయలేదు అంటే తిరుపరన్కుండ్రం కొండ మీద, ఒక సికందర్ అనే ముష్కరుని పేరు మీద ముస్లింలు ఒక దర్గా ఉందికదా.. విచిత్రం ఏమిటంటే, దర్గా లోపల అన్ని దేవాలయాన్ని పోలిన ఆకృతి, స్థంబాలు, ఇక మొత్తం కొండ మాదే అని వాదిస్తున్నారు… దీపం వెలిగిస్తే ఎక్కడ వాళ్ళ మనసు నొచ్చుకుంటుందో అని డీఎంకే ప్రభుత్వం బాధంతా… అందుకే డీఎంకే ప్రభుత్వం మరియు ఎండోమెంట్ శాఖ హై కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో అప్పీల్ కూడా దాఖలు చేసింది, కానీ ఆ అప్పీల్ సుప్రీం కోర్టు కొట్టివేసింది. అయితే ఇదే డీఎంకే ప్రభుత్యం, హిందువులకు పవిత్ర క్షేత్రమైన తిరుపరన్కుండ్రం కొండ పైన SDPI కార్యకర్తలు జంతు బలి చేయడానికి ప్రయత్నించినప్పుడు కానీ, IUML ఎంపీ నవాస్ కానీ నాన్ వెజ్ భోజనం చేసి “ఇది వక్ఫ్ ఆస్తి” అంటూ ప్రకటించినప్పుడు కానీ ,కొండను “సిక్కందర్ హిల్స్”గా మర్చి పెట్టాలన్నప్పుడు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా వారికి బాసటగా నిలిచింది. అయితే హిందువులు కోర్టు ద్వారా తమ హక్కులను సాధించడానికి ప్రయత్నించగా “లా అండ్ ఆర్డర్ సమస్య” అన్న పేరుతో హిందువుల హక్కులని కాలరాసే ప్రయత్నం చేస్తుంది.
ఇదే డీఎంకే నాయకులు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని “డెంగ్యూ, మలేరియా, కరోనా” లాగా నిర్మూలించాలి అంటే, MP ఏ.రాజా మరింతగా ముందుకు వెళ్లి దానిని HIV, కుష్టువ్యాధికి పోల్చుతూ అవమానించారు. తిరుపరన్కుండ్రం వివాదం ఒక ఆలయ కోసమో, దీపం వెలిగంచడానికి ఉన్న సమస్య మాత్రమే కాదు. ఇది హిందువుల ధార్మిక హక్కులు, వారి నమ్మకాలు, వారి సంప్రదాయాల పరిరక్షణకు సంబంధించిన సమస్య. కోర్టు స్పష్టమైన ఆదేశం ఉన్నప్పటికీ ప్రభుత్వం అమలు చేయకుండా అడ్డుకోవడం, హిందువుల ఆందోళనలను నిర్లక్ష్యం చేయడం, ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకు తగిన తీరు కాదు.





