News

బోడోలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం

621views

బోడోలకు ప్రత్యేక రాష్ట్రం కోసం అసోంలో పోరాడుతున్న తీవ్రవాద గ్రూపులైన నేషనల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ బోడో ల్యాండ్‌ (ఎన్‌డీఎఫ్‌బీ), ఆల్‌ బోడో స్టూడెంట్స్‌ యూనియయన్‌ (ఏబీఎస్‌యూ)తో కేంద్రం ఒప్పందం చేసుకుంది. బోడో తెగ వారికి రాజకీయంగా, ఆర్థిక హక్కులు కల్పించేందుకు ఉద్దేశించిన త్రైపాక్షిక ఒప్పందంపై ఎన్‌డీఎఫ్‌బీ, ఏబీఎస్‌యూ ప్రతినిధులు, అసోం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్‌, హోంశాఖ కార్యదర్శి సత్యేంద్ర గార్గ్‌, అసోం సీఎస్‌ కుమార్‌ సంజయ్‌ కృష్ణ సంతకం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో ఈ ఒప్పందం కుదిరింది.

ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. ”ఇవాళ కేంద్రం, అసోం ప్రభుత్వం, బోడో ప్రతినిధులు ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేశారు. అసోం, బోడో ప్రజల బంగారు భవితకు ఇది బాటలు వేస్తుంది. ఈ ఒప్పందం బోడోల రాజకీయ, ఆర్థిక ఆకాంక్షలను నెరవేస్తుంది. బోడోల భాష, సంస్కృతులను కాపాడుతుంది” అని షా అన్నారు. జనవరి 30 నాటికి 1500 మంది తీవ్రవాదులు లొంగిపోతారని, ఇకపై వారందరూ తమ సోదరులని వ్యాఖ్యానించారు. బోడో ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి పరిహారం కింద రూ.5లక్షలు అందజేస్తామని షా తెలిపారు. బోడో తీవ్రవాదులతో గతంలో రెండు ఒప్పందాలు జరిగాయి.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.