News

విదేశీయుల విష్ణు సహస్రనామ పారాయణం

729views

భారతీయ సంప్రదాయ వస్త్రధారణ, నుదుటన తిలకం, ముచ్చటగా అలంకరణ చేసుకుని మువ్వన్నెల జెండాను ధరించి వేంకటేశ్వరుని సన్నిధిలో వీనుల విందుగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్న విదేశీయులను చూసి స్థానిక భక్తులు ఆశ్చర్యచకితులయ్యారు. విశాఖ నగరానికి విచ్చేసిన రష్యా, స్విట్జర్లాండ్, దేశాలకు చెందిన పర్యాటకులు ఆదివారం పెందుర్తి వేంకటాద్రి పైనున్న శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. వీరు మూడేళ్లుగా వేంకటాద్రిని సందర్శిస్తున్నారు. వీరికి ప్రధాన అర్చకులు మహర్తి రామానుజాచార్యులు స్వాగతం పలికి వారి పేరిట అర్చనలు చేశారు. అనంతరం ఆ విదేశీ భక్తులు ఆలయ ఆవరణలో కూర్చుని విష్ణు సహస్రనామం, శ్రీ సూక్తం, ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేశారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.