
ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు సేవయాత్ర, నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ & సేవాభారతి కలిసి అక్టోబర్ 31వ తేదీన 100 మెడికల్ క్యాంప్స్ నిర్వహించారు. 110 సేవాబస్తీలలో వైద్య శిబిరం జరిగింది.
ఈ కార్యక్రమంలో 4 మెడికల్ కాలేజీలు, 88 మంది డాక్టర్లు, 873 మంది ఎమ్బిబిఎస్ విద్యార్థులు పాల్గొని 8779 మందికి వైద్యం చేశారు. 467 మంది కార్యకర్తలు పని చేశారు.
నేషనల్ మెడికల్ కౌన్సిల్ మాజీ చైర్మన్, బెంగళూరు పూర్వ సంఘచాలక్
డాక్టర్ గంగాధర్, గాయత్రి మెడికల్ కాలేజీ ఎమిడి డాక్టర్ సోమరాజు, కెజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి కార్డియాలజిస్ట్, ఎన్ఎమ్ఎ విశాఖ ప్రెసిడెంట్, డాక్టర్ సుబ్రహ్మణ్యం, సేవా భారతి ప్రాంత కార్యదర్శి డాక్టర్ తిరుపతి రావు, ఎన్ఎమ్ఎ ప్రాంత సంఘటన మంత్రి డాక్టర్ కుళ్లాయి రెడ్డి, విభాగ్ ప్రచారక్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.





