
305views
దేశంలోని అయ్యప్ప భక్తులందరికి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం అయిన శబరిమల శ్రీ అయ్యప్ప ఆలయం వారం రోజుల పాటు తెరుచుకోనుంది. ఈ నెల 17 నుంచి తుల మాసం ప్రారంభం కానుండటంతో ఆలయాన్ని తెరిచేందుకు అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ అధికారిక క్యాలెండర్ ప్రకారం, “తుల మాస పూజలు” అక్టోబర్ 17 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు “Sabarimala Ayyappa Temple Calendar 2025-26”లో పేర్కొనబడింది. ఈ పూజలు కేవలం ఆరు రోజుల పరిమిత కాలానికి మాత్రమే నిర్వహించబడతాయి. దీంతో శభరిమలకు వెళ్లేందుకు అయ్యప్ప భక్తులు సిద్ధం అవుతున్నారు.



