
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించామన్నారు టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో సాలకట్ల బ్రహ్మోత్సవాల సక్సెస్ మీట్ ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా టిటిడి ఇఓ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నామని..తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు వాహనసేవలను, శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించామన్నారు. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా చూశామని..ముఖ్యమంత్రి ఆదేశాలతో టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు సలహాలు, సూచనలతో ముందుకు వెళ్ళామన్నారు. భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగినా రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశామని.. టిటిడి, పోలీసు సమన్వయంతో పనిచేశామన్నారు. ముఖ్యమంత్రి అభినందనలు తెలపడం మరింత ప్రోత్సాహాన్నిస్తోందని..కోట్లాదిమంది భక్తులు టిటిడి ఏర్పాట్లను అభినందించారని..సమన్వయంతో పనిచేసి వైకుంఠ ఏకాదశి, తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు, రథసప్తమిని విజయవంతం చేద్దామన్నారు.





