News

మహర్షి వాల్మీకి పట్ల భక్తి ప్రపత్తులు చాటిన నంద్యాల స్వయంసేవకులు

320views

నంద్యాల జిల్లా, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, సంఘ చాలక్ శ్రీ చిలుకూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మర్యాదా పురుషోత్తముడు ప్రభు శ్రీరాముని చరిత్రను ప్రపంచానికి అందించిన మహర్షి వాల్మీకి జయంతిని పురష్కరించుకుని, స్థానిక ఆర్టీసి బస్టాండ్ సమీపంలో వెలసిన ఆయన విగ్రహానికి మాలార్పణ గావించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, రామ నామము జీవహింస చేసి జీవనం సాగించే ఒక బోయవానిని మహర్షిగా మార్చిందని, ఆయన యావత్ మానవాళి ఆదర్శ జీవన విధానానికి చుక్కాని లాంటి శ్రీమద్రామాయణ మహా కావ్యాన్ని ప్రపంచానికి అందించారని తెలియజేశారు.

సదరు కార్యక్రమంలో నగర సంఘ చాలక్ శ్రీ కుంచా మహేశ్వర్ రెడ్డి, నగర ప్రచార ప్రముఖ శ్రీ చింతలపల్లి వాసు, నగర కార్యవాహ శ్రీ వీరేంద్ర తదితర స్వయం సేవకులు పాల్గొన్నారు