
నంద్యాల జిల్లా, స్థానిక బాలాజీ కాంప్లెక్స్ లోని కేశవరెడ్డి పబ్లిక్ స్కూల్ నందు బాలాజీ బస్తీకి సంబందించిన సంఘ్ శతాబ్ది ఉత్సవం వైభవంగా జరిగింది.
నగర సంఘ్ చాలక్ శ్రీ మహేశ్వర రెడ్డి, ముఖ్య అతిథి భాజాపా నగర అధ్యక్షుడు శ్రీ మహేష్, ప్రధాన వక్త శ్రీశైలం శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్ర ప్రముఖ్ శ్రీ చింతం మునీశ్వర్ జ్యోతి వెలిగించి భరత మాత, పరమ పూజనీయ డాక్టర్ జీ, గురూజీల చిత్ర పటాలకు మాలార్పణ గావించి పుష్పాంజలి ఘటించారు.

ప్రధాన వక్త సంఘ్ ప్రారంభం నాటి ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను వివరించి, పరమ పూజనీయ డాక్టర్ జీ వ్యక్తి నిర్మాణం యొక్క ఆవశ్యకతను గుర్తించి కేవలం ఐదుగురు చిన్నారులతో విజయ దశమి రోజున సంఘ్ ను ప్రారంభించిన విషయాన్ని వివరించారు. ఎన్నో ఆటు పోటులను, నిషేధాలను ఎదుర్కొని నేడు ప్రపంచమంతా విస్తరించి ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛంద సేవా సంస్థగా మారిందని తెలియ జేశారు.
సమాజ నిర్మాణంలో, సమాజ సేవలో, విపత్తుల సమయంలో సంఘ్ సేవలు అజరామరం అని తెలిపారు.

ప్రస్తుతం భారత దేశం విదేశీ విద్రోహ శక్తుల తీవ్రదాడిని ఎదుర్కొంటుందనియూ, సమాజంలో సమైక్యత, సమరసత సాధిస్తూ ముందుకు సాగేందుకు సంఘ్ పంచ పరివర్తన్ పేరిట సమగ్రాభివృద్ది ప్రణాళికతో ముందుకు నడవాలని పిలుపు నిచ్చారు.
సదరు కార్యక్రమ నిర్వహణకు శ్రీ చింతల పల్లే వాసు, శ్రీ నాగదీపు , స్థానిక స్వయం సేవకులు కృషి చేశారు.




