
204views
దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్రపై ఒడిశాలోని కటక్ లో ఇస్లామిక్ ఛాందసులు రాళ్లదాడికి దిగారు. దీంతో అక్కడ మత ఘర్షణలు చెలరేగాయి. ఈ సందర్భంగా పోలీసులు 36 గంటల పాటు కర్ఫ్యూను విధించారు.అలాగే ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపేశారు.మరోవైపు ఇస్లామిక్ మూకలు రాళ్లదాడి చేయడంపై విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా మండిపడింది. దీనికంతటికీ జిల్లా యంత్రాంగం, పోలీసులు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కటక్ బంద్ కి పిలుపునిచ్చింది.కదమ్ రసూల్ ప్రాంతాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని మరియు కటక్ జిల్లా కలెక్టర్ మరియు డీసీపీని బదిలీ చేయాలని డిమాండ్ చేసింది.
దుర్గాదేవీ నిజమజ్జన శోభాయాత్రలోకి జిహాదీలు దూరి, దుర్గామాత విగ్రహంపై, భక్తులపై రాళ్లు విసిరారని, మారణాయుధాలతో కూడా దాడి చేశారని కటక్ విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు వాసుదేవ బెహ్రా మండిపడ్డారు. దీనిని ఖండిస్తున్నామని, జిల్లా పోలీసు యంత్రాంగం సమక్షంలోనే ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు.కటక్‌లోని రెండు మండపాలైన భాగవత సమితి ఝంజిరిమంగళ మరియు రౌషపట్న మైదానాలలో ఈ దాడులు జరిగాయని, చాలా మందికి గాయాలయ్యాయని తెలిపారు. అలాగే పోలీసులు కూడా గాయపడ్డారని, మతోన్మాదులు పదునైన ఆయుధాలతో దాడికి దిగారన్నారు.

పోలీసుల వైఫల్యం… సీసీటీవీ, డ్రోన్లపై పనితీరుపై అనుమానాలు..
పోలీసులు, పరిపాలనా విభాగం 1,000 సీసీ టీవీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారని, కానీ వాటి వల్ల ప్రయోజనం ఏంటని వాసుదేవ బెహ్రా ప్రశ్నించారు. ఇలా దాడులు జరగడం అంటే పూర్తిగా పోలీసుల వైఫల్యమేనని మండిపడ్డారు.సామాన్య ప్రజలతో పాటు, పోలీసులపై కూడా దాడి జరిగిందని, డీసీపీ కూడా గాయపడ్డారన్నారు.

ఇస్లామిక్ ఛాందసులు పదునైన ఆయుధాలు, కర్రలను ప్రదర్శిస్తుండగా, పోలీసులు వారికి రక్షణ కల్పిస్తున్నారని, దీనికి సంబంధించిన వీడియోలు కూడా తమ వద్ద వున్నాయని ఆయన ప్రకటించారు. పోలీసులు వారినివెంటనే అరెస్ట్ చేయాల్సింది పోయి, మౌనంగా వున్నారన్నారు.హిందూ సమాజాన్ని కించపరచడమే కాకుండా, ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో సందేహాలు వస్తున్నాయన్నారు.స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే సోఫియా ఫిర్బోస్ ఆధ్వర్యంలో పాకిస్తాన్ జెండాను ఎగురవేయడం, “ఐ లవ్ మొహమ్మద్” ను ప్రచారం చేయడం వంటి కార్యకలాపాలు పెరుగుతున్నాయని స్పష్టంగా తెలుస్తుందోన్నారు.ప్రభుత్వం హిందూ పండుగలపై కూడా వివిధ ఆంక్షలు విధించడం ద్వారా అశాంతి సృష్టిస్తోందని ఆరోపించారు.
కటక్ ప్రాంత బంద్ కి పిలుపు…
ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం కటక్ ప్రాంతం బంద్ కి పిలుపునిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది. ఈ బంద్ కి హిందువులందరూ సంపూర్ణ మద్దతును ఇచ్చి, బంద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
శాంతియుత వాతావరణానికి సహకరించాలి : ముఖ్యమంత్రి
జరుగుతున్న సంఘటనలపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ స్పందించారు. హింసపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అందరూ ప్రశాంతంగా వుండాలని కోరారు.కటక్ నగరం సోదరభావానికి ఒక ప్రత్యేక ఉదాహరణ. అయితే, గత కొన్ని రోజులుగా, కొంతమంది అల్లకల్లోలకారుల కారణంగా, నగరంలో శాంతిభద్రతలు దెబ్బతింటున్నాయి మరియు సామాన్యుల జీవితానికి అంతరాయం కలుగుతోంది, ”అని ముఖ్యమంత్రి అన్నారు. “ప్రభుత్వం అటువంటి శక్తులపై నిఘా ఉంచింది మరియు చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటుంది’’ అని ప్రకటించారు. అలాగే ఈ అల్లర్లలో గాయాలైన వారికి ఉచిత వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఇంటర్నెట్ సేవలు నిలిపివేత…
కటక్ లో జరుగుతున్న సంఘటనల దృష్ట్యా 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పుకార్లు వ్యాప్తం కాకుండా వుండేందుకు ఈ నిర్ణయమని పేర్కొంది. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి సోమవారం రాత్రి 7 గంటల వరకు కటక్ లో ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. ఈ మేరకు అడిషనల్ సీఎస్ సత్యవ్రత సాహూ ఉత్తర్వులిచ్చారు.




